రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడిందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఇది కొనసాగుతోందని పేర్కొంది.
రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్టు హెచ్చరికలు జారీ చేసింది .
నేడు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే
అవకాశం ఉంది.
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు పెంచుతారా ?
రాష్ట్రంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో అత్యధికంగా 15.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా కన్నేపల్లిలో 12.2, ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట 11.9, దహేగాం 11.2, భూపాలపల్లి జిల్లా పలిమెల 10.8, మహదేవ్‌పూర్ 10, ములుగు జిల్లా వాజేడు 8.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 7.7 సెం.మీటర్లు కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణలోనూ ఓ మోస్తరుగా వర్షలు కురిసాయి.
Share your comments