ఇప్పటికే రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదయ్యింది. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన విషయం తలిసింది.. దీనికి తగ్గట్టుగానే రాష్ట్రంలో ఇప్పటికి 30-40 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది . రైతులు వర్షాలకు ఎదురుచూస్తున్న క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది . రానున్న రెండు రోజులలో రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలోఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 72గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురవనున్నాయి. అయితే, ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో ఉపరతిల ఆవర్తనం ఏర్పడనుందని, రేపు అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.
రైతులకు శుభవార్త: రైతుల ఖాతాల్లో నేడే రైతుబంధు..స్టేటస్ చెక్ చేయండి ఇలా !
తెలంగాణ:
భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, కామారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి అదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Share your comments