తెలంగాణాలో భిన్న వాతావరణం నెలకొంది ఒకవైపు రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రాష్ట్రానికి రానున్న 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయి అన్న వర్ష సూచనతో రైతులలో తీవ్ర ఆందోళన నెలకొంది , ఒకవైపు ఎండలు మరోవైపు వర్ష సూచనలతో తెలంగాణాలో భిన్న వాతావరం నెలకొంది .
శనివారం నుంచి రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .అత్యధికంగా ఈ ప్రభావం దక్షిణ తెలంగాణలోని జిల్లాపై ఉండనున్నట్లు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది .
నల్గొం డ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, వనపర్తి, రంగా రెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది .
ఇది కూడా చదవండి .
కట్నం అడిగినా, తీసుకున్నా డిగ్రీ రద్దు! తెలంగాణ లో కూడా అమలు అవ్వనుందా?
అదేవిధంగా వర్షాలకంటే తెలంగాణలోనే హైదరాబాద్ పరిసర జిల్లాలు మినహాయిస్తే అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతవరణ శాఖ హెచ్చరించింది , గురువారం రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా కరీంనగర్ జిల్లా తంగులలో 45.6, నల్గొండ జిల్లా దామరచర్లలో 45.5. కరీంనగర్ జిల్లా వీణవంక, సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి .
Share your comments