ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ ఇటీవల కొన్ని సానుకూల వార్తలను అందించింది. ఎండలతో మగ్గిపోతున్న తెలంగాణకు మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇంకా, ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఫలితంగా రానున్న 48 గంటల్లో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకారం, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సోమవారం, సెప్టెంబర్ 4 నుండి బుధవారం, సెప్టెంబర్ 5 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉంది.
అదనంగా, ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. అంతేకాకుండా, ఈరోజు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యగా ఆయా జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫించన్ల పునరుద్దరణకు ప్రభుత్వం ఆదేశాలు
సెప్టెంబరు నెలకు దీర్ఘకాల సగటు వర్షపాతం 167.9 మి.మీ. కాగా దానిలో 9% అటూఇటూగా నమోదవుతుందని చెప్పారు. ఒకవేళ ఎక్కువగా కురిసినా జూన్-సెప్టెంబరు వానాకాలపు సగటు వర్షపాతం మాత్రం సాధారణం కంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా వేశారు.
'జులైలో అధిక వర్షాలు పడిన తర్వాత ఆగస్టులో రుతుపవనాలు జాడైన కనిపించలేదు. నెలలో కోన్నిప్రాంతలలో 20 రోజులపాటు ఎక్కడా చినుకుపడలేదు. ఎల్‌నినో పరిస్థితులు దీనికి కారణంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల ఇప్పుడు ఎల్‌నినో సానుకూలంగా మారడం మొదలైంది. దీంతోపాటు తూర్పుదిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతుపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది' అని చెప్పారు.
ఇది కూడా చదవండి..
Share your comments