News

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు: IMD Yellow అలర్ట్ !

Srikanth B
Srikanth B
IMD Yellow అలర్ట్ !
IMD Yellow అలర్ట్ !

హైదరాబాద్: వారంరోజుల పాటు ఎండ వేడిమికి గురైన హైదరాబాద్ లో బుధవారం ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షంతో కురిసింది . నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

IMD- హైదరాబాద్ ప్రకారం, బేగంపేటలో 63.1 mm వర్షపాతం నమోదైంది మరియు ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 19.6 డిగ్రీల సెల్సియస్‌ గ నమోదు అయింది 

భారత వాతావరణ శాఖ (IMD) - హైదరాబాద్‌లో బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రాబోయే నాలుగు రోజులపాటు భారీ నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు  IMD Yellow  అలర్ట్ ! జారీ ఉందని తెలిపింది .

"తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (30-40 kmph) కురిసే అవకాశం ఉంది" అని  IMD పత్రికా ప్రకటన ద్వారా  తెలిపింది.

హైదరాబాద్, రంగారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాలు, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జైశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు

వడ దెబ్బ నుంచి చిన్నారులను ఎలా రక్షించాలి !

Share your comments

Subscribe Magazine

More on News

More