ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు భారీ నష్టాన్ని మిగిలించిన విషయం తెలిసిందే . బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి.
ఈ భారీ వర్షాల కారణంగా ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం జిల్లాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా భారీ ఆస్థి మరియు ప్రాణ నష్టాన్ని ముగించింది.
అయితే మరోసారి బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతుందని అది బలపడి సెప్టెంబర్ 23 భారీ వర్షాలు మరియు ఏపీలో రానున్న మూడు రోజులు బలమైన గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటిచింది . దీని ప్రభావంతో భారీ వర్షాలు శుక్రవారం మరియు శనివారం భారీ పడే ఛాన్స్ ఉంది. ఈ నెల 23, 24వ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది వాతావరణ శాఖ. అనకాపల్లి, కోనసీమ, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Share your comments