ఇప్పటికే కురిసిన వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలంగాణ కు మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లించింది, బుధవారం రాష్ట్రం లోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ శాఖ (IMD) బుధవారం (సెప్టెంబర్ 4, 2024) నాలుగు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. IMD బులెటిన్ ప్రకారం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది.
అదేవిధంగా, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో, రాగల 24 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. బులెటిన్ ప్రకారం, నగరంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 27°C మరియు కనిష్టంగా 23°C మధ్య ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఈదురు గాలులతో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరో వైపు వరదల్లో వస్తువులు కోల్పోయిన కుటుంబాలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Share your comments