రైతులకు ఇండియన్ మెటాలాల్‌జికల్ డిపార్ట్‌మెంట్ వెదర్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 17 వరకు భీరీగా వర్షాలు పడతాయని హెచ్చరిక జారీ చేసింది. రైతులు ఈ విషయాన్ని తెలుసుకుని పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. భారీ వర్షం బారిన పడి పంట నష్టపోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాల వల్ల కొన్ని పంటలు నష్టపోతాయి. అయితే ముందు చర్యలు తీసుకోవడం ద్వారా పంటను కొంతమేర కాపాడుకోవచ్చు. అందకే వాతావరణ సమాచారాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
తాజా వాతావరణ విషయానికొస్తే.. ఈ నెల 17వరకు తెలంగాణతో పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కొమురం భీం, అసిఫాబాద్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, వరంగల్, సంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఇక జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మంచిర్యాల, జనగాం, నారాయణపేట, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకావముందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, అశ్వరావుపేట జిల్లాలో 10వ తేదీన రికార్డు స్థాయిలో 119.8 మి.మీ వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
ఇక జయశంకర్, జనగాం, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 15.6 నుంచి 64.4 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణవాఖ అధికారులు తెలిపారు. ఇక వచ్చే రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ ఏరియాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకావముందని చెప్పింది. ఇక కేరళకు జులై 17 వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, YELLOW హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది.
Share your comments