News

తెలుగు రాష్ట్రాలకు రానున్న 3 రోజుల పాటు వర్షాలు ...

Srikanth B
Srikanth B

తెలుగు రాష్ట్రాలలో రానున్న 3 రోజులు భారీనుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను జారీచేసింది. వర్షం కురుస్తున్న సమయం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది .

అదేవిధం గ తెలంగాణలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి కొమోరిన్‌ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక అంతటా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించారు.

ఉపాధ్యాయుల దినోత్సవం: మీకు ఇష్టమైన ఉపాధ్యాయునికి మీరు ఇవ్వగల ఉత్తమ బహుమతుల జాబితా..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయని వివరించింది దీని ప్రభావం తో రానున్న మూడురోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది .

ఉపాధ్యాయుల దినోత్సవం: మీకు ఇష్టమైన ఉపాధ్యాయునికి మీరు ఇవ్వగల ఉత్తమ బహుమతుల జాబితా..

Share your comments

Subscribe Magazine

More on News

More