భారతదేశానికి ఐఎండీ తుఫాను హెచ్చరికను జారీ చేసింది. సాధారణంగా ఒక తుఫాను ముప్పు పొంచి ఉందంటేనే ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతారు. అలాంటిది.. ఇండియా మీదకు ఒకేసారి రెండు తుపానులు మంచుకొచ్చే ప్రమాదం ఉందన్న వార్త వింటే.. ఇంక చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సంఘటన జరిగే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో మరియు బంగాళాఖాతంలో కలిపి రెండు తుపానులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
తేజ్ తుపాను అరేబియా సముద్రంలో ఆందోళనలు రేకెత్తించగా, రానున్న గంటల్లో ఇది మరింత తీవ్రతరం అవుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఇలా ఉండగా, బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం తుఫాన్‌గా రూపాంతరం చెందితే దానిని 'హమూన్' తుఫాన్‌గా పేర్కొంటామని IMD స్పష్టం చేసింది.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తేజ్ తుఫాను ప్రస్తుతం నైరుతి అరేబియా సముద్రంలో మరింత బలపడుతోంది, దాని తీవ్రత సోమవారం మధ్యాహ్నం నాటికి పెరుగుతుందని అంచనా. అక్కడి నుంచి ఒమన్వైపు ఈ తుపాను ప్రయాణించే అవకాశం ఉంది," అని ఐఎండీ వెల్లడించింది.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, శుక్రవారం నైరుతి మరియు ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి సోమవారం నాటికి మరింత తీవ్రమవుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే, ప్రస్తుత తరుణంలో, ఈ అల్పపీడనం ఇంకా తుఫానుగా రూపాంతరం చెందలేదని గమనించాలి.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త.. నవంబర్ మొదటి వారంలో వారి ఖాతాల్లో డబ్బులు జమ..
భారతదేశ చరిత్రలో, దేశం ఏకకాలంలో రెండు విభిన్న తుఫానుల బారిన పడడం చాలా అరుదైన సంఘటన. చివరిగా.. 2018లో ఇలా జరిగింది. అయితే ఈ తేజ్ తుపాను, హమూన్ తుపానుల కారణంగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఐఎండీ చెబుతోంది. భారత్‌పై వాటి ప్రభావం తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తోంది ఐఎండి.
చెన్నైతో పాటు తమిళనాడు తీర ప్రాంతాలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాకపోతే కేరళ, మధ్య తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని స్పష్టం చేసింది. అధికారులు కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిదని సూచిస్తోంది. ఈ గండం దాటితే.. ఈ ఏడాది ఇక ఇలాంటివి ఇండియాను ఇబ్బంది పెట్టవని ప్రైవేట్ వాతావరణశాఖ స్కైమేట్ అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి..
Share your comments