News

మారిన తేదీ జూన్ 1 న రైతు భరోసా విడుదల ... కౌలు రైతులకు కూడా రైతు భరోసా !

Srikanth B
Srikanth B
మారిన తేదీ జూన్ 1 రైతు భరోసా విడుదల ... కౌలు రైతులకు కూడా రైతు భరోసా !
మారిన తేదీ జూన్ 1 రైతు భరోసా విడుదల ... కౌలు రైతులకు కూడా రైతు భరోసా !

మే 30 న రైతు భరోసా విడుదల కోసం ఎదురుచూస్తున్నా రైతులకు మరో రెండు రోజులు రైతు భరోసా కోసం వేచి చూడాల్సివుంది .రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ నిధులతో కలిపి రైతుభరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతులకు మూడు విడతలలో రూ . 13500 ను పెట్టుబడి సాయంగా అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత డబ్బులను జూన్ 1 తేదీన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు .

వైఎస్సార్‌ రైతుభరోసా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం, జూన్ 1 రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు 2023-24లో తొలివిడతగా 52.31 లక్షలమందికి రూ.3,934.25 కోట్లు జమచేయనున్నారు .

పొలాలు కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్న రైతులకు సైతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అర్హులైన కౌలు రైతుల జాబితాను వ్యవసాయాధికారులు ఇప్పటికే సిద్దం చేసినట్లు సమాచారం .


చేసుకుని బతుకుబండి నడుతున్న రైతులకు సైతం ప్రభుత్వం పథకాన్ని వర్తింప చేసింది. భరోసా నిధులు అందేలా చర్యలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా 7,804 మంది కౌలు రైతులకు రూ.5.85 కోట్ల నగదు వారి ఖాతాల్లో జమ చేయనుంది. భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారి హక్కుకు భంగం వాటిల్లకుండా నగదు అందజేసే ప్రక్రియకు నాంది పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు రూ.4,953 కోట్లు పంట రుణ నిధులను నిధులు మంజూరు ..

రైతు భరోసా పథకం స్టేటస్ ఎలా చెక్ చేయాలి :

YSR రైతు భరోసా PM కిసాన్ పథకం కోసం మీ స్టేటస్ తనిఖీ చేయడానికి అనుసరించాల్సిన దశలు:

1వ దశ: ముందుగా, మీరు నమోదిత రైతు అయి ఉండాలి

2వ దశ: మీరు www.ysrrythubharosa.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి

3వ దశ: మీరు ఎగువ కుడి మూలలో ఉన్న మెను-బార్‌పై క్లిక్ చేయాలి.

4వ దశ: తర్వాత, మీరు "నో యువర్ స్టేటస్" ఎంపికపై క్లిక్ చేయాలి

5వ దశ: “మీ రైతుభరోసా స్థితిని తెలుసుకోండి” ఎంపికపై క్లిక్ చేయండి

6వ దశ: మీరు ఇప్పుడు మీ "ఆధార్ నంబర్"ని నమోదు చేసి, "సమర్పించు" బటన్‌ను క్లిక్ చేయాలి.

7వ దశ: మీరు ఇప్పుడు చివరి ఇన్‌స్టాల్‌మెంట్ మరియు రాబోయే వాయిదాల కోసం మీ ఖాతా సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు.

రైతులకు రూ.4,953 కోట్లు పంట రుణ నిధులను నిధులు మంజూరు ..

Related Topics

ysr aasara YSR Rythu Bharosa

Share your comments

Subscribe Magazine

More on News

More