వేసవి కాలం వచ్చింది అంటే చాలు నిమ్మకు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఈ వినియోగం అనేది వేసవి కాలంలో మరింతగా పెరుగుతుంది. దీనితో మార్కెట్ లో నిమ్మ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే నిమ్మలో అధికంగా విటమిన్ సి అనేదాన్ని కలిగి ఉంటుంది. ఎండ తాపాన్ని నుంచి బయటపడటానికి ఈ నిమ్మ బాగా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మరసాన్ని ప్రజలు ఎక్కువగా మజ్జిగ మరియు షర్బత్ లో వాడతారు.
మార్కెట్ లో దాదాపుగా గత పది రోజుల్లో ఒక క్వింటా నిమ్మకు ధర అనేది సుమారుగా రూ.2500 వరకు పెరిగింది. క్వింటా నిమ్మకు ఈ నెల మొదలులోనే రూ.4-6 వేలు మధ్య కొనసాగింది. కానీ ఈ ధర అనేది గత వారంలో ఒక్కసారిగా రూ.7-8 వేలుకు పెరిగింది. నిమ్మకు డిమాండ్ అధికంగా ఉండడంతో పలు గ్రామాల్లో వ్యాపారులు రెండు నిమ్మకాయలు 15 నుండి 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. కొంతమంది వ్యాపారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లిమరీ నిమ్మను కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ నిమ్మ ధర అనేది మరింతగా పెరిగింది. నిమ్మకు ఎంతో ఫేమస్ అయిన ఏలూరు మార్కెట్ లో ఒక క్వింటా నిమ్మ ధర అనేది గరిష్టంగా రూ.8,700 దాకా చేరింది మరియు ఈ మార్కెట్ లో కనిష్ట ధర అనేది రూ.3,500 వరకు ఉంది. దిగుమతుల కొరకు కేవలం ఒక్క ఏలూరు మార్కెట్‌కే రోజుకు 4 వేల బస్తాలకు పైగా వస్తున్నాయి మరియు తెనాలి, రాపూరు, దెందులూరు మార్కెట్లకు వందలాది బస్తాల్లో నిమ్మకాయలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి..
రైతులకి గుడ్ న్యూస్.. ఈ కేంద్ర పథకంతో రూ.15 లక్షలు..!
మార్కెట్ లో పెద్ద సైజు నిమ్మకాయలు అధిక ధర లభిస్తుంది మిగిలిన నిమ్మకాయలు సాధారణ ధర కన్నా ఎక్కువే లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల్లో నిమ్మతోటలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వీటి నుండి 10 వేల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంటున్నారు. వేసవిలో దిగుబడి తగ్గడం, నిమ్మకాయలకు బాగా డిమాండ్ ఉండటంతో ధరలు పెరుగుతున్నాయి.
మార్కెట్ లో నిమ్మకు అధిక ధరలు పలుకుతున్న చెట్లకు కాయలు లేవని రైతులు బాధ పడుతున్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వలన పంటలు బాగా దెబ్బతిన్నాయి అని రైతులు చెబుతున్నారు. అమాంతంగా నిమ్మ ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలలు వరకు మార్కెట్ లో నిమ్మకు డిమాండ్ ఇలానే కొనసాగుతాది అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..
Share your comments