భరత్ స్పేస్ ఎక్సప్లొరేషన్ లో, కొత్త శిఖరాలను అందుకుంటుంది. ఇప్పటికే చంద్రయాన్, మంగళ్యాన్ వంటి స్పేస్ ప్రాజెక్ట్స్ లో విజయాన్ని అందుకున్న భరత్ ఇప్పుడు ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. మిషన్ గగనయాన్ ద్వారా మొదిటిసారి స్పేస్ లోకి మనుషులను పంపించబోతుంది. ఈ మిషన్ యొక్క పూర్తి వివరాలు మీ కోసం.
ప్రపంచ స్పేస్ ఎక్సప్లోరేషన్లో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్(ఇస్రో ) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. చంద్రుని మీదకి, మరియు మంగళ గ్రహం మీదకి స్పేస్ రోవర్స్ ని సక్సెస్ఫుల్ గ ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ మిషన్కి స్వదేశీ పరిజ్ఞానాన్ని మిషన్ కి ఉపయోగించడం మన అందరికి ఎంతో గర్వకారణం. ఐతే ఇస్రో ఇప్పుడు స్పేస్ లోకి వ్యోమగాములను పంపి మరో ఘనత సాధించబోతుంది . ఈ మిషన్ కి పెట్టిన పేరు మిషన్ గగన్యాన్. మిషన్ గగన్యాన్ ద్వారా భారత హ్యూమన్ స్పేస్ ఎక్సప్లోరేషన్ కి అవసరం అయ్యే స్పేస్ లాంచింగ్ మిషన్ పనితీరును సామర్ఢ్యాన్ని, పరీక్షించేందకు ముగ్గురు వ్యోమగాములను స్పేస్ లోకి పంపబోతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ మిషన్, భూమి నుండి 400KM వరకు ఆస్ట్రోనౌట్స్ను పంపి, తిరిగి భూమి మీద సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు చూస్తుంది .
మార్స్, మూన్ మీద ల్యాండింగ్:
ఈ స్పేస్ మిషన్ విజయవంతం అయిన అనంతరం ఇస్రో, మూన్ మరియు మార్స్ మీదకి మనుషులను పంపించాలి అని యత్నిస్తుంది. భారత స్వదేశీ పరిజ్ఞానం తో వివిధ స్పేస్ లాంచర్లను, ఆర్బిటాల్ మోడ్యూల్స్ ను, మన దేశంలోని రీసెర్చ్ ఇంస్టిట్యూట్ల సహకారం తో నిర్మించేందుకు భరత్ ప్రయత్నిస్తుంది.
Share your comments