ఈజిప్ట్కు కు గోధుమల ఎగుమతిని ప్రారంభించడానికి భారత్ తుది చర్చలు జరుపుతుండగా, మరో వైపు చైనా, టర్కీ, , ఇరాన్ వంటి దేశాలతో కూడా చర్చలు జరుగుతున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది
2021-22 ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో భారత గోధుమ ఎగుమతులు 1.74 బిలియన్ డాలర్లకు పెరిగాయని, గత ఏడాది ఇదే కాలంలో గోదుమల ఎగుమతి విలువ 340.17 మిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది.
2019-20లో గోధుమ ఎగుమతుల విలువ 61.84 మిలియన్ డాలర్లు కాగా, 2020-21లో ఇది 549.67 మిలియన్ డాలర్లకు పెరిగింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార ధాన్యాల సరఫరా గొలుసు కు అంతరాయాల నేపథ్యంలో భారీ షిప్మెంట్ సామర్థ్యం ఉన్న దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించడానికి వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ) ఇటీవల వాల్యూ చైన్లోని కీలక వాటాదారుల తో సమావేశాన్ని నిర్వహించిందని తెలిపింది.
"అదనపు గోధుమ రవాణా కోసం తక్షణ డిమాండ్ను తీర్చడానికి తగినంత రేక్లను అందుబాటులో ఉంచుతామని సమావేశంలో రైల్వేలు హామీ ఇచ్చాయి. పోర్టుల వద్ద గోధుమల కోసం ప్రత్యేక కంటైనర్లతో పాటు డెడికేటెడ్ టెర్మినల్స్ను పెంచాలని పోర్టు అధికారులను కోరినట్లు తెలిపింది.
భారతదేశం యొక్క గోధుమ ఎగుమతులు ప్రధానంగా పొరుగు దేశాలకు ఉన్నాయి, బంగ్లాదేశ్ 2020-21 లో పరిమాణం మరియు విలువ పరంగా 54 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఇది యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్ మరియు ఇండోనేషియా వంటి దేశాల గోధుమ మార్కెట్లలో కొత్తగ ప్రవేశించింది.
2020-21లో భారత గోధుమలను దిగుమతి చేసుకునే మొదటి పది దేశాల జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, ఇండోనేషియా, ఒమన్, మలేషియా ఉన్నాయి.
"రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తి సంస్థలు, రవాణాదారులు మొదలైన ఇతర భాగస్వాముల సహకారంతో తృణధాన్యాల ఎగుమతులకు ఊతమిచ్చేందుకు విలువ గొలుసులో మౌలిక సదుపాయాలను నిర్మించడానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము" అని ఎపిఇడిఎ చైర్మన్ ఎం అంగముత్తు చెప్పారు.
ప్రపంచ గోధుమల ఎగుమతిలో భారతదేశం 1 శాతం కంటే తక్కువ వాటాను కలిగి ఉంది. అయితే, 2016లో 0.14 శాతంగా ఉన్న వాటా 2020 నాటికి 0.54 శాతానికి పెరిగింది. 2020లో ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 14.14 శాతం వాటాతో భారతదేశం గోధుమ ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది.
భారతదేశం సంవత్సరానికి 107. 59 మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేస్తుంది, అయితే ఇందులో ఎక్కువ భాగం దేశీయ వినియోగం వైపు వెళుతుంది.
భారతదేశంలో గోధుమలు పండించే ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ మరియు గుజరాత్.
"గోధుమల యూనిట్ ధర అంతర్జాతీయ వాణిజ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గత ఐదేళ్లలో గోధుమల యూనిట్ ఎగుమతి ధర అన్ని దేశాలకు పెరిగినప్పటికీ, భారతదేశం యొక్క యూనిట్ ఎగుమతి ధర ఇతర దేశాల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. భారతదేశం నుండి గోధుమ ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేసే కారకాలలో ఇది ఒకటి" అని తెలిపింది.
Share your comments