News

ఎండాకాలం లో వివిధ పంటలలో తీసుకోవాల్సిన చర్యలు పై ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) బులిటెన్ విడుదల !

Srikanth B
Srikanth B
ఉల్లి పంట
ఉల్లి పంట

వాతావరణం దృష్ట్యా ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) పూసాకు చెందిన శాస్త్రవేత్తలు రైతులకు ఒక సలహాను జారీ చేశారు. ఈ సమయంలో ఉల్లి పంటలో పచ్చ మిడతల దాడి ఉండవచ్చని ఆయన చెప్పారు. ఉల్లి సాగు చేసే రైతులు మిడతల దాడిని గమనిస్తుండాలి. అదే విధం గ పంటకు పారాపుల్ బ్లాస్ వ్యాధి సోకె అవకాశాలు అధికం గ ఉన్ని అని పూసకు చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఒకవేళ వ్యాధి యొక్క లక్షణాలు కనిపిస్తే , ప్రతి లీటరు నీటికి డైథెన్ M-45 @ 2 గ్రాముల చొప్పున పిచికారీ చేయండి.

మామిడి మరియు నిమ్మకాయ తోట యజమానులు.

, పువ్వులు పూసే సమయంలో మామిడి మరియు నిమ్మకాయలకు నీరు పెట్టవద్దు మరియు మిల్లిబగ్ మరియు హాపర్ చీడపీడలను మానిటర్ చేస్తూ ఉండండి. టొమాటో, బఠాణీలు, వంకాయలు మరియు పెసర పంటలలో, చీడపీడల నుండి పండ్లను రక్షించడానికి రైతు పొలంలో పక్షుల ఆశ్రయాలను నాటండి.

రైతులు గోధుమ పంటలో తేలికపాటి నీటి పారుదల చేయాలి

ఉష్ణోగ్రత మరియు గాలి వేగాన్ని దృష్టిలో ఉంచుకుని, గోధుమ పంట గురించి సలహా ఇవ్వబడింది . ప్రస్తుతం పాలు లేదా ధాన్యం నింపే దశలో ఉన్న గోధుమ పంటలో రైతులు తేలికపాటి నీటి పారుదల చేయాలి. వేడి గాలులు తక్కువగా వున్నా సమయం లో నీటి పారుదల చేయండి, లేనిపక్షంలో మొక్క పడిపోయే అవకాశం ఉంది. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, గోధుమ పంటలో వచ్చే వ్యాధులను, మరిముఖ్యంగా ఆకూ ముడతలను గమనించండి. నలుపు, గోధుమరంగు మచ్చలు వచ్చినట్లైతే , ప్రతి లీటరు నీటికి డైథేన్ M-45 @ 5 g లేదా కార్బెండాజిమ్ @ 1.0 g లేదా ప్రొపియోనజోల్ @ 1.0 గ్రాముల చొప్పున కలిపి పంటకు  పిచికారీ చేయండి.

 

ఇది పెసర సాగుకు మంచి సమయం :

పెసర సాగు కోసం రైతులు   సూచించిన విత్తనాలను నాటాలని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిలో మూంగ్-పూసా విశాల్, పూసా రత్న, పూసా-5931, పూసా బైసాఖి, పీఎంఎం-11, ఎస్ఎంఎల్-32, ఎస్ఎంఎల్-668, సామ్రాట్ ఉన్నాయి. విత్తడానికి ముందు, విత్తనాలను పంట-నిర్దిష్ట రైజోబియం మరియు ఫాస్ఫరస్ కరిగే బ్యాక్టీరియాతో శుద్ధి చేయాలి. విత్తే సమయంలో, పొలంలో తగినంత తేమ ఉండటం అవసరం.

పూసా బాస్మతి బియ్యం: ఎకరానికి 100 క్వింటాలు దిగుబడినిచ్చే కొత్తరకం !

అత్యుత్తమ 6 అన్యదేశ కోళ్ల జాతుల .. గురించి తెలుసుకుందాం 

Share your comments

Subscribe Magazine

More on News

More