అమెరికాలో భారత సంతతికి చెందిన వారు అనేక విజయాలు సాధిస్తున్నారు.సుందర్ పిచాయ్,సత్య నాదెళ్ల,లీనా నాయర్ మరియు అరవింద్ కృష్ణ లాంటి వారి ప్రఖ్యాతి గురించి తెలిసిందే. ఇప్పుడు అలాంటి జాబితాలోనే తాజాగా మరొక భారతీయురాలు చేరారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వీక్షించే ప్రసిద్ధ క్రీడలలో బాస్కెట్‌బాల్ ఒకటి.దాదాపు 100 కంటే ఎక్కువ దేశాలు ఛాంపియన్‌షిప్‌లను గెలవడానికి ఒకదానితో ఒకటి పోటీపడతాయి.అమెరికాలో బాస్కెట్ బాల్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే,అమెరికాలోని నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (Nation Basketball Association)కు కోచ్ గా నియమాకం కావడం అంటే ఆషామాషీ కాదు.అయితే భారత సంతతికి చెందిన అమ్మాయి సోనియా రామన్ అమెరికా బాస్కెట్ బాల్ కోచ్ గా నియమితులయ్యారు.
ఆమె తల్లిద్రండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. (ఆమె తల్లి నాగ్‌పూర్ మరియు తండ్రి చెన్నైకి చెందినవారు), సోనియా రామన్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌లో కోచ్‌గా నియమితులైన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళగా చరిత్ర సృష్టించారు.
బోస్టన్ ప్రాంతంలో ఉన్న రామన్ న్యాయవాదం చదివారు. ఆమె ముందుగా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో ప్రధాన మహిళల బాస్కెట్‌బాల్ కోచ్‌గా ఉన్నారు. MITలో, ఆమె విద్యార్థులను 2018 మరియు 2019లో వరుసగా రెండు కాన్ఫరెన్స్ టైటిల్ విజయాలలో ఆమె కృషి ఉంది.చిన్నప్పటి నుంచే బాస్కెట్ బాల్ కు మక్కు వ పెంచుకున్న సోనియా రామన్ ఇప్పుడు అమెరికాలోనే అమెరికాలోని నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కోచ్ గా నియమితులయ్యారు.
NBAలో భారతీయ అమెరికన్లకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రంగంలో రానించాలనుకునేవారు ఎప్పుడూ కూడా గేమ్‌లో ఒక విద్యార్థిగా ఉండాలని ఆమె సలహా ఇచ్చింది.
మరిన్ని చదవండి.
Share your comments