News

పిల్లల చదువుకి తల్లిద్రండులు చేస్తున్న ఖర్చు....సర్వే వివరాలు!

S Vinay
S Vinay

ప్రముఖ ఎడ్‌టెక్ సర్వీస్ ప్రొవైడర్ స్కూల్‌నెట్ ఇండియా లిమిటెడ్ తన సర్వే 'అండర్‌స్టాండింగ్ ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ స్పెండ్స్ ల్యాండ్‌స్కేప్' ఫలితాలను విడుదల చేసింది.

భారతదేశంలోని తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం ప్రభుత్వ పాఠశాలల్లో సంవత్సరానికి సుమారు రూ. 20,000 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ బడులతో పరిగణిస్తే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు విద్య కొరకై రెట్టింపు కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, ఏటా సగటున రూ.47,000 పిల్లల చదువు కొరకై ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులలో స్కూల్ ఫీజులు, రవాణా మరియు మౌలిక సదుపాయాలు మరియు తరగతి గది సౌకర్యాలు వంటి ఇతర ఖర్చులు ఉన్నాయి, ఈ వివరాలను Edtech కంపెనీ స్కూల్‌నెట్ ఇండియా లిమిటెడ్ సర్వే వెల్లడించింది.

అంతే కాకుండా ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకి ప్రత్యేకంగా ట్యూటర్‌లు, ట్యూషన్ తరగతులు, పోటీ పరీక్షల కోసం కోచింగ్ మరియు మరిన్నింటిలో ఖర్చు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 60 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు వీటి కొరకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఈ అదనపు విద్యా ఖర్చులను భరిస్తున్నారు.

6 శాతం మంది తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయాలు వంటి ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కోసం రూ. 51,000 నుండి రూ. 1,00,000 వరకు వెచ్చిస్తున్నారని, 28 శాతం మంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో విద్య కోసం ఇదే మొత్తాన్ని వెచ్చిస్తున్నారని సర్వే యొక్క ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 480 మంది విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 437 మంది తల్లిదండ్రులు నుండి ఈ డేటా నమోదు చేయబడింది.

మరిన్ని చదవండి.

నిరుద్యోగుల పోటీ పరీక్షల కొరకు 'వారధి' యాప్!

Share your comments

Subscribe Magazine

More on News

More