News

మారిన రైల్వే ప్రయాణ నియమాలు...తప్పక తెలుసుకోండి!

S Vinay
S Vinay

భారతీయ రైల్వే, రైలు ప్రయాణంలో బెర్త్‌కు సంబంధించి రైల్వే నిబంధనలను మార్చింది.పూర్తి వివరాలను చదవండి.

ప్రయాణీకుల సౌకర్యార్థం, రైల్వే బెర్త్‌లకు సంబంధించి కొన్ని నియమాలను భారతీయ రైల్వే రూపొందించింది. ప్రయాణానికి ముందు, మీరు ఈ నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.బెర్త్ ఎంపిక సమయంలో చాలాసార్లు కోరుకున్న సీటు లభించదు. వాస్తవానికి, భారతీయ రైల్వేలో కూడా పరిమిత సీట్లు ఉన్నాయి.

ప్రయాణంలో మిడిల్‌ బెర్త్‌ దొరికితే చాలాసార్లు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి, లోయర్ బెర్త్‌లు ఉన్న ప్రయాణికులు తరచుగా అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటారు. అటువంటి పరిస్థితిలో, మిడిల్ బెర్త్ ఉన్న వారు ఇబ్బందికి గురవుతారు. ఇదే సమస్యని మరొక కోణంలో చూస్తే చాలా సార్లు మిడిల్ బెర్త్‌ పొందిన ప్రయాణికులు రైలు స్టార్ట్ అయిన వెంటనే దాన్ని తెరిచి నిద్రకి ఉపక్రమిస్తారు. దీంతో లోయర్ బెర్త్ ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీనిని అధిగమించడానికి భారతీయ రైల్వే కొన్ని నిబంధనలను చేర్చింది. ఈ కొత్త రైల్వే నిబంధనల ప్రకారం మిడిల్ బెర్త్ పొందిన ప్రయాణికుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తన బెర్త్‌లో పడుకోవచ్చు.

సీనియర్ సిటిజన్లకు ఇకపై రాయితీ ఉండదు

సీనియర్‌ సిటిజన్‌లకు టిక్కెట్‌ ధరలపై రాయితీ ఇకపై అందుబాటులో ఉండదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల తెలిపారు.మహమ్మారికి ముందు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు రైలు టిక్కెట్లపై 40 శాతం తగ్గింపు లభించింది. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50 శాతం తగ్గింపు లభించింది. డిస్కౌంట్ గురించి వైష్ణవ్ మాట్లాడుతూ, భారతీయ రైల్వేలు ఇప్పటికే టిక్కెట్లను రాయితీతో అందిస్తున్నాయని చెప్పారు. ఒక్కో టికెట్‌కు రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నారని, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఒక్కో టికెట్‌కు రూ.100 చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని చదవండి.

Aadhar card update: ఇప్పుడు పోస్టాపీసులో ఆధార్ కార్డు అప్ డేట్ సేవలు

ఇప్పుడు వాట్సాప్‌లో తక్షణమే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకు!

Related Topics

indian railway train

Share your comments

Subscribe Magazine

More on News

More