ఒక సొంత ఇంటిని ఏర్పరచుకోవాలనేది ప్రతి ఒక్క కుటుంబం కల. కానీ ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా చాల మంది పేదవారికి ఇది ఒక కలగానే మిగిలిపోతుంది. ఆర్ధిక స్తోమత సహకరించకనో, లేదా వేరే కారణాల వల్లనో సొంత ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ చాల మందికి నెరవేరడం లేదు. ఐతే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఈ ఆశ నెరవేరి, తమ సొంతఇంటి కల సాకారం అయ్యే రోజులు వచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, అమలుచేస్తామన్న ఆరు గ్యారంటీలలో, ఇందిరమ్మ ఇల్లు పధకం ఒక్కటి. ఇప్పుడు ఈ హామీని నిజం చేస్తూ, భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు పధకాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి. రేవంత్ రెడ్డి, ప్రారంభించారు. ఈ స్కీం ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి, ఉచితంగా ఇళ్ల స్థలాల్ని, 5,00,000 రూపాయిల ఆర్ధిక సహకారాన్ని అందిస్తారు. దళితులకు ఈ సహకారం 6,00,000 రూపాయలుగా ఉండబోతుంది. ఇళ్ల నిర్మాణానికి 250 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. ఇల్లు లేని పేదవారందరికి సొంత ఇంటిని ఏర్పరచడం ఈ స్కీం యొక్క ప్రధాన లక్ష్యం.
గత ప్రభుత్వ హయాంలో, 14,00,000 ఇళ్లను బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఇచ్చే ఇళ్లకు కొత్త, డిజైన్లను ఇప్పటికే సిద్ధంచేసింది. ఈ ఇల్లు మరింత విశాలంగా, కొత్త హంగులతో రూపొదిద్దుకోనున్నాయి. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు పట్టాలను త్వరలోనే అందచేస్తాం అని తెలంగాణ డిప్యూటీ సీఎం. బట్టి విక్రమార్క తెలిపారు.
ఈ స్కీం కి అవసరం అయ్యే డాక్యూమెంట్లు:
- ఆధార కార్డు
- బ్యాంకు అకౌంట్ వివరాలు
- పాస్పోర్ట్ సైజు ఫొటోస్.
- ఆదాయం యొక్క రుజువు.
- అడ్రస్ ప్రూఫ్
- రేషన్ కార్డు
- మొబైల్ నెంబర్
- మరేతర కలిగి లేనట్టు రుజువు చేసే పట్టా అవసరం.
Share your comments