పెరుతున్న పెట్రోల్ ధరలు కారణంగా రైతు పంటను మార్కెటు కు తరలించడమే పెద్ద సమస్యగా మారిపోయింది , రవాణాకు అయ్యే ఖర్చు మార్కెట్లో దళారుల దోపిడీ రైతులను నట్టేట ముంచుతున్నాయి ,అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందనంగా రైతు పరిస్థి మారిన క్రమాంలో మహారాష్ట్ర హింగోలి జిల్లాకు చెందిన గజానన్ అనే రైతు వినూత్నంగా ఆలోచించాడు మార్కెట్ కు కూరగాయలను తక్కువ ఖర్చుతో తీసుకెళ్లాలని తన బైకుకు ట్రాలీని చేయించాడు .
బైకుకు ట్రాలీని జోడించడం వల్ల అదనపు పెట్రోల్ ఖర్చులు కూడా ఆదా అవుతాయి గతంలో గజానన్ సతవ్ కూరగాయలను పొలం నుంచి మార్కెట్‌కు తరలించేందుకు రోజుకు ఒకటి నుంచి వెయ్యిన్నర రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు ఆ ఖర్చు ఆదా చేసుకున్నాడు.
రైతు తన బైకుకు ట్రాలీని తగిలించి తీసుకెళ్తుండగా దారి మధ్యలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు దీనితో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది .
రాష్ట్రవ్యాప్తంగా 100 సెంటర్లులో కంది కొనుగోళ్లు ...
దీనిపై అనేక మంది అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు , కొందరు ప్రభుత్యం వ్యవసాయం రంగం గురించి పట్టించుకోవడం లేదని , కొందరు పెరుగుతున్న పెట్రోల్ ధరకు ఇది మంచి నిరసన అని , మరి కొందరు రైతు తిలివి అమోఘం అని అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు . ఏది ఏమైనప్పటికి అహర్నిశలు కష్టపడి పంట పండించిన రైతుకు పంటను అమ్మడం లో కూడా అంతే కష్టపడాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది , పంటను అమ్మడానికి వెళ్ళినప్పుడు ఒక ధర పంట కొనడానికి వెళ్ళినప్పుడు మరో ధర అని రైతులు మండిపడుతున్నారు .
Share your comments