భారతదేశంలో ప్రతిరోజు లక్షల మంది ప్రజలు రైలులో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చాలా మంది ప్రజలు ట్రైన్ టిక్కెట్ల కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. తాజాగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటీసి) తమ ప్రయాణికులకు హెచ్చరికను ఇస్తుంది. కొత్తగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఒక యాప్ చక్కెర్లు కొడుతోంది. ఆ యాప్ ని ఇంస్టాల్ చేయవద్దని ఐఆర్‌సీటీసీ సంస్థ ప్రయాణికులను హెచ్చరిస్తోంది.
ఆ యాప్ అనేది "irctcconnect.apk" పేరుతో చక్కర్లు కొడుతోంది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసాడం ద్వారా ప్రజలు వివిధ సమస్యల్లో చిక్కుకుంటారు అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఏపీకే యాప్. ఇది హానికరమైనదని, మీ మొబైల్ పరికరానికి హాని కలిగించవచ్చని ఐఆర్‌సీటీసీ హెచ్చరిస్తోంది. ఇది చాలా డేంజరస్ యాప్ అని ఐఆర్సిటీసి పేర్కొంది. కాబట్టి ఈ యాప్ లింక్ టెలిగ్రామ్ లేదా వాట్సాప్ లో వచ్చిన ఇంస్టాల్ చేయవద్దు.
ఒకవేళ ప్రయాణికులు టికెట్ ని బుక్ చేసుకోవాలంటే గనుక ఆండ్రాయిడ్ యూజర్లు ఐఆర్‌సీటీసీ అధికారిక యాప్ డౌన్‌లోడ్ చేయాలంటే గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి. గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లి ఐఆర్‌సీటీసీ అని సెర్చ్ చేస్తే మనకి ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ కనబడుతుంది. ప్రయాణికులు ఆ యాప్ ను మాత్రమే డౌన్లోడ్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోవాలి. లేదా https://www.irctc.co.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి రైలు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
పడిపోయిన ధరలు.. నష్టాల్లో రైతులు
ఐఆర్‌సీటీసీ సంస్థ నుండి వచ్చే మెయిల్స్ సరిగ్గా చూసుకోవాలి. సైబర్ నేరగాళ్లు ఐఆర్‌సీటీసీ నుంచి మెయిల్స్ పంపుతున్నట్టు నమ్మించి మోసం చేస్తున్నారని, కస్టమర్ల యూపీఐ, బ్యాంక్ ఖాతా లాంటి వివరాలు దొంగిలిస్తున్నారని ఐఆర్‌సీటీసీ గుర్తించింది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి మేము ఐఆర్‌సీటీసీ నుండి కాల్ చేస్తున్నాము అని, బ్యాంక్ ఖత వివరాలు అడిగితే చెప్పొద్దని ఐఆర్‌సీటీసీ తెలుపుతుంది. ఎవరితోనూ ఓటీపీ కాని బ్యాంక్ నంబర్ కానీ ఇవ్వకూడదు.
ఇది కూడా చదవండి..
Share your comments