ఉల్లిపాయ, వెల్లుల్లి లేనిది వంటిట్లో ఏ పని జరగదు. ఏది వండాలన్నా ఈ రెండు తప్పనిసరిగా కావాల్సిందే. అందుకే ఉల్లి నిత్యావసరాల జాబితాలో ఉంది. ఏది వండాలన్నా సరే.. ఉల్లిపాయ అనేది తప్పనిసరిగా కావాలి. ఉల్లిపాయ లేనిది ఏ పదార్థం కూడా రుచి అనిపించదు. ఏది వండాలన్నా సరే... ముందు నూనెలో ఉల్లిపాయ వేయాల్సిందే. అయితే ఉల్లి, వెల్లుల్లికి వచ్చే మొలకలను తినడం మంచిదా?.. కాదా?.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వంటగదిలో తప్పనిసరిగా ఉల్లిపాయలు, వెల్లుల్లి ప్రతిఒక్కరూ పెట్టుకుంటారు. ఎందుకంటే ఏది వండాలన్నా.. అవి కావాలి కాబట్టి. అయితే మన వంటగదిలో నిల్వ ఉండే ఉల్లి, వెల్లుల్లికి మొలకలు రావడం మనం గమనిస్తూ ఉంటాం. కొంతమంది ఆ మొలకలు కట్ చేసి వాటిని ఉపయోగించుకుంటారు. మరికొందరు వాటిని ఉపయోగించరు.
అయితే ఇలాంటప్పుడు కాస్త పొడవైన భాగాన్ని తొలగించి మంచిగా ఉన్న భాగాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ మొలకల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకోవడం కూడా మంచిదే. కానీ బాగా మొలకలు వచ్చిన తర్వాత ఉల్లిపాయలు కుళ్లుతాయి. అప్పుడు మొలకలను తీసుకోకుండా ఉల్లిపాయలను పారేయడమే మంచిది.
అప్పుడప్పుడే మొలకలు వస్తున్న వాటిని మాత్రమే తీసుకోవాలి. ఈ మొలకలు కూడా నేరుగా తినకూడదు. కూరల్లో వేసుకుని తింటే బాగుంటుంది.
మొలకలు ఎందుకు వస్తాయంటే?
సాధారణంగా కిచెన్‌లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉల్లిపాయలకు మొలకలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా చల్లగా, పొడిగా ఉన్న వాతావరణంలో ఉంచితే మొలకలు రాకుండా చూసుకోవచ్చు. ఇక గాలి ఆడేలా చూసుకోవాలి. గాలి తగలకపోతే కుళ్లిపోతాయి.
Share your comments