"రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని త్వరలోనే ఆపేయాలని నిర్ణయించింది. ప్రజలకు ఈ పథకం ద్వారా లబ్ది పొందే అవకాశం లేదు. ఇక నుండి ఆరోగ్య పథకాలపై లబ్ది పొందాలంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకమే అమల్లో ఉంటుంది. భారత్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇక నుండి ఉచిత వైద్యం అందుతాది, ఈ ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ చివరి తేదీ" అని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు వస్తున్నాయా?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రము అంతటా ఇటువంటి మెసేజ్లు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. చాలా అంది ఈ మెసేజ్లను గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. దీని వలన ప్రజలకు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో అర్ధంకావట్లేదు. ఈ మెసేజ్లను చదివి అయోమయానికి లోనవుతున్నారు. ఈ మెసేజ్లను ప్రజలు చదివి, ఇది నిజమనుకుంటున్నారు.
ఇకనుండి ఉచిత వైద్యం పొందాలంటే ఆయుష్మాన్ భారత్ తప్పని సరి అని అనుకుని, చాలా మంది ప్రజలు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీనిని అలుసుగా తీసుకుని చాలా ఈ సేవ కేంద్రాలు ఒక్క దరఖాస్తుకు వచ్చేసి 30 రూపాయల నుండి 100 రూపాయల వరకు తీసుకుంటున్నారు.
ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత అని అందరికి ప్రశ్నగా మారింది. ఈ ప్రచారాలకు అధికారులు ఆ మెసేజ్ ను నమ్మొద్దని, అది అబద్దపుప్రచారమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ మెసేజ్లను నమ్మొద్దని సూచించారు.
ఇది కూడా చదవండి..
తెలంగాణాలో ఏప్రిల్ 1 నుండి కొత్త విద్యుత్ ఛార్జీలు..
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక్కో రోగికి సగటున రూ.11,924 మాత్రమే ఇస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఒక్కో రోగిపై సగటున రూ.46,250 ఖర్చు పెడుతుందని తెలిపారు.
అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందని, కానీ ఆరోగ్యశ్రీ పథకం 90 లక్షల కుటుంబాలకు వర్తిస్తుందని తెలిపారు. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలను పట్టించుకుని ప్రజలు తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments