గగన్‌యాన్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అద్భుతాన్ని సాధించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 10 గంటలకు గగన్‌యాన్ మొదటి దశ టీవీ-డీ1 విజయవంతంగా చేపట్టింది. ఈ రాకెట్... క్రూ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌ని నింగిలోకి తీసుకెళ్లింది.
ఈ ప్రయోగంలో రాకెట్.. తనలో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను భూమి నుంచి 17 కిలోమీటర్ల ఎత్తులో విడిచి పెట్టింది. తర్వాత ప్యారాచూట్ సాయంతో షార్‌కి 10 కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతంలో క్రూ మాడ్యూల్ దిగింది. అప్పటికే బంగాళాఖాతంలో రెడీగా ఉన్న నౌకా దళ సిబ్బంది.. క్రూ మాడ్యూల్‌ని స్వాధీనం చేసుకొని, ఒడ్డుకి తీసుకొచ్చారు. ఇదంతా 8 నిమిషాల్లో ముగిసింది.
44 టన్నుల బరువున్న అబార్ట్ మిషన్-1 టీవీ-డీ1 రాకెట్ షార్‌లోని ప్రారంభ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 10 గంటలకు విజయవంతంగా ప్రయోగించింది. ఎస్కేప్ మాడ్యూల్‌తో పాటు క్రూ మాడ్యూల్‌ను నింగిలోకి తీసుకెళ్లే బాధ్యత ఈ ప్రత్యేక రాకెట్‌దే. ఈ అసాధారణ ప్రయోగం, బంగాళాఖాతంలో నియంత్రిత అవరోహణ మరియు తదుపరి పునరుద్ధరణను అనుసరించి, గణనీయమైన ఎత్తులో సిబ్బంది మాడ్యూల్ మరియు తప్పించుకునే వ్యవస్థ యొక్క విజయవంతమైన విభజనను అమలు చేయగల రాకెట్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
ఇది కూడా చదవండి..
తెలంగాణాలో సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే?
ముందుగా అనుకున్న ప్రకారమైతే ఇవాళ ఉదయం 8 గంటలకు తిరుపతి జిల్లా.. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ (SHAR) నుంచి గగన్‌యాన్ తొలి దశ ప్రయోగం TV-D1ని చేపట్టాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపాన్ని చివరిక్షణంలో గుర్తించడంతో.. ప్రయోగాన్ని ఆపేశారు. ఆ తర్వాత సమస్యను సరిచేసి, మళ్లీ లాంచ్ చేశారు.
త్వరలో ఇస్రో.. క్రూ మాడ్యూల్‌లో మనుషుల్ని ఉంచి, రోదసిలోకి పంపాలని భావిస్తుంది. అలా పంపడానికి.. క్రూ మాడ్యూల్ సరిగా పనిచేస్తోందో లేదో ముందుగా టెస్ట్ చెయ్యాలి. అందుకోసం జరిపినదే ఇవాళ్టి ప్రయోగం. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది కాబట్టి... అబార్ట్ మిషన్-1 TVD-1 ద్వారా మనుషులతో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ని నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
ఇది కూడా చదవండి..
Share your comments