News

ITR : మార్చి 31 లోపు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే ఏమి జరుగుతుంది?

Srikanth B
Srikanth B

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 31 డిసెంబర్ 2021 గడువు తేదీలోపు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ని ఫైల్ చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారుల కోసం, ఆదాయపు పన్ను చట్టం మూడు నెలల గడువుతో ఆలస్యంగా ITRని ఫైల్ చేయడానికి అనుమతిస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుడడం తో  (AY 2021-22), ITRని ఫైల్ చేయడానికి మార్చి   31 చివరి తేదీ ,కోవిడ్-19 మహమ్మారి కారణంగా , ఆలస్యంగా రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు తేదీని ఫిబ్రవరి 15 నుండి మార్చి 31కి వాయిదా వేశారు.

ఒక నివేదిక ప్రకారం, గడువుకు ముందు ఎవరైనా ITR ఫైల్ చేయడంలో విఫలమైతే, వారు జరిమానా విధించబడవచ్చు. జరిమానా లేదా పెనాల్టీ రూపంలో ఉండవచ్చు.

మీరు మార్చి 31 లోపు ITR ఫైల్ చేయకపోతే ఏమి జరుగుతుంది?

1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 270 ప్రకారం 50% వరకు జరిమానా విధించే అధికారం ఐటీ శాఖకు ఉంది .

50% జరిమానాతో పాటు, పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేసే తేదీ వరకు ఎన్ని రోజుల పాటు మొత్తానికి వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

సెక్షన్ 234 F ప్రకారం, ITRని డిసెంబర్ 31, 2021 తర్వాత సమర్పించినట్లయితే తప్పనిసరిగా రూ.5000 జరిమానా చెల్లించాలి. ఇది రూ. 5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయానికి వర్తిస్తుంది.

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి జరిమానా రూ.1000.

అలాగే, ITR ఫైల్ చేయని పక్షంలో, ఆలస్యం వ్యవధిలో చెల్లించిన అదనపు పన్నుల వాపసుపై ఎలాంటి వడ్డీని పొందేందుకు పన్ను చెల్లింపుదారుకు అర్హత ఉండదు.

 

గడువు తేదీ వలె, ఆదాయపు పన్ను పోర్టల్ మరియు కోవిడ్-19లో అవాంతరాల కారణంగా చివరి తేదీ కూడా పొడిగించబడింది.

ఆలస్యమైన రిటర్న్‌లను దాఖలు చేయడంతో పాటుగా ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేనప్పటికీ, మీరు అధిక ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది కావున నిర్దిష్టమైన గడువులో  ITR  ను ఫైల్ చేయండి.

ఏప్రిల్ 1 నుంచి PF డబ్బులపై కొత్త పన్ను విధింపు !

Share your comments

Subscribe Magazine

More on News

More