ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. రాష్ట్రంలో ఇటీవలి కురిసిన అకాల వర్షాలు మరియు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఈనెలలోపే పంట నష్ట పరిహారాన్ని విదుదల చేస్తామని ముఖ్యమంత్రి రైతులకు హామీ ఇచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తమ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు వారం రోజుల సమయం కేటాయించిందని, మరింత ప్రభావవంతమైన చర్యల వైపు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
తొలి రోజు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. కూనవరం, వీఆర్ పురం మండలాల్లో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను స్వయంగా కలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అందించిన సహాయక చర్యలు గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. పేదలకు సహాయం అందించే విషయంలో తమ ప్రభుత్వ ఎప్పుడూ వెనకడుగు వేయబోదని జగన్ తేల్చి చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరదల కారణంగా జరిగిన పంట నష్టంపై తక్షణమే అంచనాలను రూపొందించి అందించాలని అదికారులను ఆదేశించారు. పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని తెలియజేసారు.
ఇది కూడా చదవండి..
నేడే వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల.! 141కోట్లను ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్
వరద బాధిత ప్రాంతాలను వ్యక్తిగతంగా సందర్శించిన ఆయన రెండు రోజులు బాధితులతో మమేకమై ప్రతి ఇంటికి అవసరమైన సహాయం అందేలా చూశారు. పంట నష్టం జరిగితే ఆర్బీకేల్లో నమోదు చేసుకోవాలని కోరారు. రెండు రోజుల్లో ఆర్బీకే కేంద్రాల్లో వరద బాధితుల జాబితా, నెలలోపే పంట నష్ట సాయం, గతంలో ఎప్పుడూ ఇలా పారదర్శకంగా వేగంగా అందించలేదన్నారు సీఎం జగన్.
ఇది కూడా చదవండి..
Share your comments