News

జగనన్న విద్యాదీవెన డబ్బులు వచ్చేశాయి..

KJ Staff
KJ Staff

ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోంది. అందులో భాగంగా విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఫీజు రీయింబర్స్ మెంట్‌తో పాటు హాస్టల్ ఫీజులు కూడా చెల్లిస్తుంది. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను నేరుగా కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చేవారు. కానీ జగన్ ప్రభుత్వం నిబంధనలను మార్చింది. డబ్బులను నేరుగా విద్యార్థుల తల్లి ఖాతాల్లో జమ చేస్తోంది.

జగనన్న విద్యాదీవెన పథకం కింద ప్రతి విద్యాసంవత్సరంలో నాలుగు విడతలుగా డబ్బులు అందిస్తుంది. తాజాగా 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇవాళ మొదటి విడత డబ్బులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీని వల్ల 10 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. దీని కోసం రూ.671.45 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ మేరకు ఆర్థికశాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ నిధులను విడుదల చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశాయి. బీసీ సంక్షేమ శాఖ రూ.491.42 కోట్లు విడుదల చేసింది. ఎస్సీ విద్యార్థుల కోసం ఎస్సీ సంక్షేమశాఖ రూ.119.25 కోట్లు, ఎస్టీ సంక్షేమశాఖ రూ.19.10 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ రూ.41.68 కోట్లు విడుదల చేసింది.

ఈ క్రమంలో ఇవాళ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రెండో విడత డబ్బులను జులైలో ఇవ్వనుండగా.. మూడో విడత డిసెంబర్‌లో, నాలుగో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జమ కానున్నాయి.

Share your comments

Subscribe Magazine

More on News

More