News

JAI JAWAN JAI KISAN: జవాన్ ‘కిసాన్’ గ మారనున్న తరుణం!

S Vinay
S Vinay

ఇన్ని రోజులు తుపాకులతో దేశ సరిహద్దుల్లో కాపల కాసిన జవాన్ ఇప్పుడు నాగలి పట్టనున్నాడు వినడానికే ఆశ్చర్యంగా ఉన్న విషయం త్వరలోనే ఆచరణ లోకి రానుంది.

జై జవాన్ జై కిసాన్ అనే  ఈ నినాదానికి భారతదేశంలో ఎంత ప్రాముఖ్యత ఉందొ తెలిసిందే.భారతీయులందరికి ఈ నినాదంతో  ప్రత్యేక అనుబంధం ఉంది. భారతీయులందరు  ఖచ్చితంగా ఈ నినాదాన్ని పలుకుతే పెరిగినవారే,ఇప్పుడు విషయానికి వస్తే (INDIAN ARMY)  భారతీయ రక్షణశాఖలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన సైనికులను వ్యవసాయం వైపు మళ్లించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.

సైనికులకు MANAGE శిక్షణ:

పదవి విరమణ పొందిన సైనికులు వివిధ ఉద్యోగాలను వెతుక్కొని వారు విధుల్లో  చేరుతున్నారు. అయితే హైద్రాబాద్ లో ఉన్న  (National Institute of Agricultural Extension Management)  జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ చేపట్టిన ఒక అధ్యయనంలో సైనికులు వ్యవసాయ రంగం పై  ఆసక్తి చూపక పోవడం పై  కారణంవ్యవసాయం పై వారికి  సరైన అవగాహన లేకపోవడమే అని వెల్లడైంది

అయితే ఎంతో క్రమశిక్షణతో  మెలిగే సైనికులకు వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో శిక్షణ ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని MANAGE ధృడంగా భావిస్తోంది. దీనికి సంబంధించి రక్షణ శాఖతో చర్చలు జరిపింది.రక్షణ శాఖ కూడా సానుకూలంగానే స్పందించింది.

NEET 2022: ఈ రోజు రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది!

Share your comments

Subscribe Magazine

More on News

More