News

దీపావళి నుంచి జియో 5జీ సేవలు.. మొదటగా మెట్రో నగరాలలో

Srikanth B
Srikanth B

ఇప్పుడు మరింత వేగంగ దేశ వ్యాప్తం గ 5జి సేవలను విస్తరించనున్న భారత టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దీపావళి పర్వదినం నుంచే ఈ సేవలు మొదలు కానున్నట్లు అంబాని వెల్లడించారు .

ఇంటర్నెట్ వినియోగ దారులకు ఇదొక పెద్ద శుభవార్త , మరింత వేగం గ ఇంటర్నెట్ సేవలను దీపావళి నుంచి పొందే అవకాశం దీపావళి నుంచి దేశంలో రిలయన్స్ జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రకటించారు. 45వ AGM సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ఈ ప్రకటన చేశారు. ముందుగా ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 5G అందుబాటులోకి వస్తుందని ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. ఎటువంటి వైర్లు లేకుండా అందించే ఈ సేవలను జియో ఎయిర్‌ ఫైబర్‌గా నామకరణం చేసినట్టు జియో చైర్మన్‌ ఆకాశ్ అంబానీ తెలిపారు.

పాకిస్థాన్ లో కిలో టమాటా రూ . 500 భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అవకాశం !

కాగా, దేశ వ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెచ్చేందుకు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటిసారిగా వర్చువల్‌ రియాల్టీ విధానంలో ఈ AGM నిర్వహించారు. 5G సేవలందించేందుకు మెటా, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌తో భాగస్వామ్యాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కుదుర్చుకుంది.

పాకిస్థాన్ లో కిలో టమాటా రూ . 500 భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అవకాశం !

Share your comments

Subscribe Magazine

More on News

More