News

పదో తరగతి విద్యార్హతతో 'ఇండియా పోస్ట్‌'లో ఉద్యోగాలు.. !

Srikanth B
Srikanth B

India Post Recruitment 2022: ఇండియా పోస్ట్ 'స్టాఫ్ కార్ డ్రైవర్' పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు indiapost.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 20, 2022. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 24 పోస్టులు భర్తీ చేయనున్నారు.అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

విద్యార్హత, ఇతర అర్హతలు :

గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మోటార్ మెకానిజంపై కూడా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అభ్యర్థులు కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ నడిపిన అనుభవం కలిగి ఉండాలి.
పదవీ విరమణ చేసిన లేదా ఒక సంవత్సరంలోపు రిజర్వ్‌కు బదిలీ చేయబడి, తగిన అర్హతలు ఉన్న మాజీ సైనికులు కూడా అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగానికి అర్హులుగా పరిగణించబడతారు.

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ

అప్లికేషన్, డాక్యుమెంట్స్ పంపించాల్సిన చిరునామా :

అభ్యర్థులు సీనియర్ మేనేజర్ (JAG), మెయిల్ మోటార్ సర్వీస్, నం. 37, గ్రీమ్స్ రోడ్, చెన్నై- 600006.

పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌

https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_13062022_MMS_Eng_01.pdf లింకుపై క్లిక్ చేయండి.

హెలికాప్టర్ కొనేందుకు బ్యాంకుకు వెళ్లిన రైతు ఎందుకొ మీకు తెలుసా?

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన:చేపల పెంపకానికి ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీ

Share your comments

Subscribe Magazine

More on News

More