తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి రాష్ట్రంలో ఎన్నడూ ఊహించని విధంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు అయ్యింది , ఇప్పటికే కొన్ని జిల్లలో వరి కోతలు ప్రారంభం అయ్యి కొనుగోళ్లు కూడా ప్రారంభం అయ్యాయి మొదట మిర్యాలగూడ లో ప్రారంభమైన వరి కోతలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కోతలు ప్రారంభం అయ్యాయి అయితే దళారుల చేతులలో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించింది ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా రాష్ట్రంలో అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు .
కరీంనగర్రైతులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా ధాన్యం కొనుగోలుకు పకడ్బం దీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన మా ట్లాడారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతుల కోసం షామియానాలు, మంచినీరు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించా లన్నారు. ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడునమోదు చేయాలన్నారు.
అడిషనల్ కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ... జిల్లాలో గత రబీ సీజన్ లో 3,02,668 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చిందన్నారు. ఈ రబీ సీజన్లో 4,52,885 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నామన్నా రు. ఈ సమీక్షా సమావేశానికి అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీధర్, మార్కెటింగ్ అధికారి పద్మావతి, సివిల్ సప్లైస్ ఆఫీసర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి.
పీఎం కిసాన్ 14 వ విడత ఎప్పుడో తెలుసా ..!
ఈ సంవత్సరం కరీంనగర్ జిల్లా 2. 55 లక్షల ఎకరాలలో సాగు అయ్యింది వరిసాగులో ఉమ్మడి నల్గొండ అగ్రగామిగా నిలిచింది , నల్గొండలో 5 . 4 లక్షల ఎకరాలో వరిసాగు జరగగా సూర్యాపేట లో 4 లక్షల ఎకరాలు , యాదాద్రి భువనగిరి 2 లక్షల ఎకరాలు , తరువాతి స్థానంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు నిలిచింది . మహబూబ్ నగర్ జిల్లా లో 3. 9 లక్షల ఎకరాలలో వరిసాగు జరుగగా తరువాతి స్థానంలో సిద్ధిపేటలో 3. 31 లక్షల ఎకరాలలో సాగు జరిగింది .
ఇది కూడా చదవండి.
Share your comments