కర్ణాటకలోని, విజయపుర జిల్లా, లచ్చయన్ గ్రామానికి చెందిన చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. 1.5 ఏళ్ల సాత్విక్ సతీష్ ముజగోండ్ అనే చిన్నారి ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. ఈ విష్యం తెలిసిన అధికారులు, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ అధికారులు, 20 గంటల పాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకి తీశారు.
ఇంకా వివరాల్లోకి వెళితే, లచ్చయన్ కు చెందిన సాత్విక్ సతీష్ ముజగోండ్ అనే బాలుడు ఏప్రిల్ 3 వ తారీఖున తమ ఇంటి వద్ద ఉన్న పొలంలో ఆడుకుంటూ, బోరు బావిలో పడిపోయాడు. బాలుడి జాడ కనిపించకపోవడంతో తల్లి తండ్రలు వెతుకగా, బోరు బావి నుండి పిల్లాడి ఏడుపు విని వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు.ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ దళాలు వెంటనే సంగటన స్థలానికి చేరుకొని, రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. బాలుడు జారిపడిన బోరు బావి సుమారు 16 అడుగుల లోతు ఉంది. క్రేయిన్ సాయంతో బావికి సమాంతరం 21 అడుగుల లోతు వరకు గుంతను తవ్వి బాలుడిని రక్షించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ 20 గంటల పాటు కొనసాగింది. ఎన్డిఆర్ఎఫ్ బృందం బాలుడికి ఊపిరి ఆడేందుకు గొట్టాల ద్వారా ఆక్సిజన్ అందించారు. బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
Share your comments