ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ తెలిపారు. ఉద్యోగులు ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై ఎట్టకేలకు ప్రకటన చేశారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుందని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు కేసీఆర్ మరో వరం ప్రకటించారు.
పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్ దారులు, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు, హోంగార్డులకు పీఆర్సీ వర్తిస్తుందన్నారు.
ఇక అంగన్ వాడీతో పాటు ఆశా కార్యకర్తలు, విద్యా వాలంటీర్లు, సెర్ప్ ఉద్యోగులు, కేబీబీవీ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు వచ్చేలా ప్రక్రియ మొదలుపెడతామన్నారు.
పీఆర్సీ ఎప్పుడో ప్రకటించాల్సి ఉందని, కరోనా వల్ల కాస్త ఆలస్యమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పది ఐదేళ్లకోసారి పీఆర్సీ ప్రకటిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
Share your comments