తెలంగాణ వ్యాప్తముగా గర్భిణీ ల కోసం డిసెంబర్ 21 బుధవారం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది . గర్భిణి స్త్రీలలో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఈ పథకం దోహదపడనుంది .
గర్భిణుల్లో రక్తహీనత లోపం ఎక్కువగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఈ కిట్‌లను ప్రారంభించనున్నారు.తల్లి మరియు శిశు ఆరోగ్యం (ఎంసీహెచ్)పై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని గర్భిణుల కోసం బుధవారం నుంచి ‘ కేసీఆర్ పోషకాహార కిట్’లను ప్రారంభించనుంది.
ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే గర్భిణుల పోషకాహార స్థితిని మెరుగుపరచడమే కేసీఆర్ పోషకాహార కిట్‌ల లక్ష్యం . గర్భిణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కిట్‌లను ప్రారంభించనున్నారు.
కరోనా భయం తో నాలుగేళ్లుగా ఇంట్లోనే తల్లీకూతుళ్లు ..
ఈ జిల్లాల్లో మొత్తం 1.50 లక్షల మంది గర్భిణులు కిట్‌ల ద్వారా నేరుగా లబ్ధి పొందనున్నారు. మొత్తం 2.50 లక్షల కిట్‌లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 50 కోట్లు.
బుధవారం కామారెడ్డిలో వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా, మిగతా ఎనిమిది జిల్లాల్లో స్థానిక మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Share your comments