అహర్నిషలు శ్రమించి పండించిన పంటను కళ్లముందే పక్షులు తినేస్తుంటే దిక్కు తోచని స్థితిలో కెన్యా రైతులు ఉన్నారు .. పంటకు నష్టం జరుగుతుండడంతో ప్రభుత్వమే ఏకంగా బడ్జెట్ ను ప్రతిపాదించి మరి పక్షులను చంపాలనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవడనికి ఈ కధనాన్ని చదవండి .
వెస్ట్ కెన్యా ప్రాంతంలోనే 5 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతోంది. అందులో మూడొంతుల ధాన్యాన్ని రెడ్ బిల్ట్ క్యూలియా పక్షులే అనగా మనదగ్గ వుండే పిచుకల మాదిరి పక్షులు పంటను తినేస్తున్నాయి . బ్యాంకుల నుంచి అప్పు చేసి మరి రైతులు పంటలను సాగు చేస్తుంటే పండిన పంటను గుంపులుగా వాలి పక్షులు పంట నష్టాన్ని కల్గిస్తున్నాయి . దీనితో రైతులు అప్పుల బారిన పడుతున్నారు అదేకాకుండా దేశంలో ప్రజలు ముందే కరువుతో అల్లాడుతున్నారు , ఈ సందర్భంలో పిచుకలు వల్ల మూడోవంతు ధాన్యం నష్టపోతుండడంతో దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది.
క్యూలియా పక్షులు అచ్చం మన దగ్గర ఉండే పిచ్చుకల్లా ఉంటాయి. ఎర్రటి ముక్కుతో చూడ్డానికి అందంగా ఉంటాయి. వీటికి ఆఫ్రికన్ నైటింగల్ అనే పేరు కూడా ఉంది. ఈ పక్షులు పెద్ద ఎత్తున సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఇవి ప్రధానంగా గడ్డి విత్తనాలు తింటాయి. కానీ గత పదేళ్లుగా తూర్పు ఆఫ్రికా దేశాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయి. పచ్చిక బయళ్లన్నీ ఎండిపోవడంతో క్యూలియా పక్షులకు సహజ అహారమైన గడ్డి విత్తనాలకు కొరత ఏర్పడింది. దీంతో ఆహారం కోసం వరి, గోధుమ పంటల మీద అవి దాడి చేస్తున్నాయి.
గోమాతకు సీమంతం చేసిన రైతు..
దీనితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ,దీనిని నిర్ములించడానికి కేంద్ర మరియు స్థానిక ప్రభుత్వాలు కట్టడి చర్యలను ముమ్మరం చేస్తున్నాయి ఏకం రానున్న బడ్జెట్ లో దాదాపు 60 లక్షల పక్షులను చంపడానికి ఏకంగా బడ్జెట్ ను కేటాయించే విధంగ చర్యలను తీసుకోనున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి . ఈనిర్ణయం పై ప్రకృతి,పర్యావరణ ప్రేమికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరియు ఇలా పిచుకలిని ఒకేసారి చంపడం ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
Share your comments