తెలంగాణాలో కుక్కల దాడి ఘటనలు ఆగడంలేదు రోజుకు ఎక్కడో ఒక చోట విధి కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే వున్నాయి దీనితో జనాలు రోడ్లపై ఒంటరిగా తిరిగె వారిపై దాడి చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి దీనితో రోడ్లపై ఒంటరిగా వెళ్లాలన్న బయపడవల్సిన పరిస్థితి నెలకొంది .
తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధికుక్కలు దాడిలో మరో బాలుడు ప్రాణాలను కోల్పోయాడు , చోటు అని పిలవబడే 8 ఏళ్ళ బాలుడు రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద రోడ్డుపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటున్న క్రమంలో బాలుడు ఒంటరిగా ఉండడాన్ని గమనించిన విధి కుక్కలు ఒక్కసారిగ బాలుడిపై దాడికి తెగబడ్డాయి దీనితో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు .గత వారమే జీవనోపాధికోసం ఖాజీపేటకు వలస వచ్చిన బాలుడి కుటుంబం .. పొట్టకూటికి వచ్చి బాలుడిని పోగొట్టుకున్నామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జివనోపాధి కోసం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నుండి వచ్చిన సంచార తెగ నగరంలో చిన్న చిన్న వస్తువుళ్ళను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు , అయితే తమ కమ్యూనిటీకి చెందిన బాలుడు మృతిచెడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Share your comments