కస్టమర్లు తాము కొన్న వస్తువుల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లైతే తమ అసౌకర్యాన్ని వ్యక్తీకరించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇప్పుడు అలంటి సంఘటనే ఢిల్లీ NCR లో జరిగింది. పూర్తి వివరాలు చదవండి.
ఇటీవలే 19 లక్షలు వెచ్చించి కారు కొన్న వ్యక్తి దాని పనితీరు నచ్చకపోవడంతో, కారు వెనుకాల 'చెత్త కారు' (హిందీలో) అంటూ బ్యానర్ కట్టుకొని నిరసన తెలుపుతున్నాడు.ఈ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.కారు వెనక కట్టిన బ్యానర్ లో సందేశం ఈ విధంగా ఉంది. "కియా కార్లు కొనాలనుకునే వారు జాగ్రత్తగా ఉండండి,నేను కియా అనే చెత్తను రూ.19 లక్షలకు కొన్నాను"
అయితే సదరు యజమాని బ్యానర్ ను తన కారు వెనకాల కట్టి అందులో తిరుగుతున్నాడు. అంతే కాకుండా ఆ బ్యానర్లలో అతడు తన మొబైల్ నంబర్ ను సైతం ఉంచాడు.
ఆ యజమాని ఢిల్లీ NCR గురుగ్రామ్‌లోని కియా ప్రధాన కార్యాలయం చుట్టూ తన కియా కారెన్స్ MPVని నడిపారు. కియా అధికారుల దృష్టిలో పడటానికే ఈ విధంగా చేసారు. అయితే తాను బ్యానర్ లో కారు పట్ల అసంతృప్తిగా ఉండటానికి గల ఖచ్చితమైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
అయితే కార్ల విషయంలో ఇలాంటి నిరసనలు కొత్తేమి కాదు. గతంలో BMW X1 పట్ల విసుగు చెందిన యజమాని తన కారును చెత్త సేకరించేవాడిలా చేశాడు.స్కోడా ఆక్టావియా విషయంలో నిరసనగా గాడిదల సహాయంతో దానిని లాగారు.అమెరికాలో టెస్లా కారు సర్వీస్ కు కొన్న ధర కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని నిరసన వ్యక్తం చేస్తూ దాన్ని 30 కిలోల డైనమైట్ తో పేల్చేసాడు.
మరిన్ని చదవండి.
Share your comments