
రైతులకు మేలు చేసేలా వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి AI ఆధారిత పద్ధతులను ప్రవేశపెట్టింది.
రైతులకు AI తో సత్వర పరిష్కారం
- "కిసాన్ ఈ-మిత్ర", కృత్రిమ మేధస్సుతో పనిచేసే చాట్‌బాట్, PM కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది.
- బహుళ భాషలలో ప్రావిణ్యం ఉన్న ఈ చాట్‌బాట్, ఇతర ప్రభుత్వ పథకాల కోసం కూడా అభివృద్ధి చెందుతోంది.
- ప్రస్తుతం ఒకరోజుకి 20,000 రైతుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఇప్పటివరకు 92 లక్షలకుపైగా ప్రశ్నలకు పరిష్కారం అందించింది.
పురుగుల నియంత్రణకు నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్
- AI, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పంటలకు కలిగే పురుగుల ముప్పును ముందుగానే గుర్తించే "నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్" ఏర్పాటు.
- రైతులు పురుగుల ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం ద్వారా, పురుగుల దాడిని అరికట్టే చర్యలు చేపట్టే అవకాశం.
- 61 పంటలు, 400కి పైగా పురుగుల నియంత్రణకు ఈ వ్యవస్థ సహాయపడుతోంది.
అధునాతన పంట ఆరోగ్య నిర్ధారణ
- వాటర్, మట్టిలో తేమ, ఉపగ్రహ చిత్ర ఆధారంగా ధాన్యం, గోధుమ పంటల ఆరోగ్య స్థితిని మానిటరింగ్ చేయడం.
- రైతులకు పంట నష్టాలను తగ్గించి, అధిక దిగుబడులు సాధించే మార్గదర్శనం.
వాడేది ఎలా?
కిసాన్ ఈ-మిత్ర ని వాడటం చాల సులభతరం. ఫోన్లోనుంచి కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. కేవలం https://chatbot.pmkisan.gov.in వెబ్ పేజీని తెరిచి అందులో పిఎం-కిసాన్ లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన ఏ ప్రశ్న అయినా అడగవచ్చు.
AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాలు రైతులకు కొత్త మార్గాలు చూపిస్తున్నాయి. "కిసాన్ ఈ-మిత్ర" వంటి చాట్ బాట్ రైతుల మిత్రులుగా మారి, వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి.
Share your comments