News

40 ఏళ్లకే 44 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ!

Srikanth B
Srikanth B

ఆఫ్రికా ఖండం లో ఉగాండా దేశానికి చెందిన మరియం అనే మహిళకు అతనికి చిన్న వయసులోనే పెళ్లయింది. అంటే మరియమ్ కు 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. దీంతో ఆమె 13 ఏళ్లకే గర్భం దాల్చింది. ఆమె అత్యధిక కవలలను కలిగి ఉన్న మొదటి వ్యక్తి. మరియు ఆమె ప్రపంచంలోనే చిన్న వయసులో అత్యధిక పిల్లలను కల్గిన మహిళగా పరిగణించబడుతుంది.

12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు పెళ్లి చేశారు దీంతో ఆమె 13 ఏళ్లకే గర్భం దాల్చింది.ఆ తర్వాత కంటిన్యూగా పిల్లలకు జన్మనిచ్చిన మరియం వయసు ఇప్పుడు 40 ఏళ్లు. ఇప్పటి వరకు 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఈమె . ఇందులో 4 సార్లు కవలలు పుడతారు, ఒక డెలివరీలో 3 పిల్లలు అంటే 5 సార్లు, ఒక డెలివరీలో 5 పిల్లలు 5 సార్లు పుడతారు. ఆమెకు ఒకసారి మాత్రమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది మిగిలిన ప్రతి సారి కవలలకు జన్మనిచ్చింది . దీనికి హైపర్‌వోయులేట్ అనే కారణం తో ఈ మహిళకు ప్రతి సారి కవలలకు జన్మనిచ్చింది .

ఆమె మొత్తం 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది, అందులో 6 మంది పిల్లలు మరణించారు.ఇప్పుడు 20 మంది అబ్బాయిలు, 18 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. మరియమ్మ ఆస్తి అంతా తీసుకుని ఆమె భర్త కుటుంబం నుంచి పారిపోయాడు. దీంతో మరియం పిల్లలను పోషించడానికి కష్టపడుతోంది.

అత్యంత ఖరీదైన మామిడి పండు ఏదో తెలుసా?

హైపర్‌ఓవ్యులేషన్ ఏమిటి ?

హైపర్‌ఓవ్యులేషన్ అనేది ఒక సహజ ప్రక్రియ, దీనిలో ఒక స్త్రీ యొక్క అండాశయాలు ఒకే ఋతు చక్రంలో అనేక అండాలను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ ఏ స్త్రీలోనైనా సంభవించవచ్చు, అయితే ఇది కొంతమంది స్త్రీలలో చాలా సాధారణం. సాధారణ స్త్రీలకంటే హైపర్‌ఓవ్యులేషన్ జరిగే స్త్రీలలో ఒక కాన్పులో అధికమంది పిల్లలకు జన్మనిస్తారు .

అత్యంత ఖరీదైన మామిడి పండు ఏదో తెలుసా?

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine

More on News

More