పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను తిరిగి వెతికి పెట్టేందుకు ప్రభుత్వం కొత్త పోర్టల్ ను ప్రారంభించింది , ఇప్పుడు ఎవరైనా తమ ఫోన్ పోగొట్టుకుంటే సులభంగా తిరిగి పొందేందుకు వీలుగా కొత్త పోర్టల్ సంచార్ సాథీ ను ప్రారంభించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పోరాటాలు ద్వారా పోయిన తమ మొబైల్స్ ట్రాక్ లేదా బ్లాక్ చేసుకోవడంతోపాటు, ఇంతకు ముందు వేరెవరైనా వాడిన డివైస్‌ను కొనుగోలు చేసే ముందు ఆ డివైస్ సరైనదేనా, కాదా అనే అంశాన్ని కూడా సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు .
ఫోన్ పోగొట్టుకున్న వారెవరైనా ఈ పోర్టల్‌ను ఆశ్రయించొచ్చు. ఐడెంటిటీ వెరిఫికేషన్, అవసరమైన సమాచారం అందించి ఇచ్చిన వెంటనే ఈ పోర్టల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లతో ఈ సంచార్ సాథీ పోర్టల్ ఇంటరాక్ట్అయి, పోయిన ఫోన్ బ్లాక్అయ్యేలా చూస్తుందని" వైష్ణవ్ వివరించారు. యూజర్ సేఫ్టీ విషయంలో ప్రధాన మంత్రికి స్పష్టమైన విజన్ ఉందని, ఆ విజన్‌కు తగినట్లుగానే సంచార్ సాథీ ఉంటుందని పేర్కొన్నారు. వాట్సప్‌కాల్స్ ద్వారా జరుగుతున్న మోసాలపై అడిగిన ప్రశ్నకు, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వాట్సప్ అకౌంట్లను డీయాక్టివేట్ చేయడానికి మెటా కంపెనీ ఒప్పుకుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
సంచార్ సాథీ పోర్టల్ లో ఎలా కంప్లైంట్ చేయాలి ?
మొదట మొబైల్ పోగొట్తుకున్నా వ్యక్తి సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలి .
తరువాత మొబైల్ SIM సర్వీస్ ప్రొవైడర్ నుంచి తమ మొబైల్ మొబైల్ నెంబర్ డూప్లికేట్ SIM తీసుకోవాలి దీని ద్వారానే మొబైల్ బ్లాక్ చేయడం మరియు మొబైల్ తిరిగి పొందిన్నపుడు యాక్టివేట్ అవుతుంది .
అవసరమైన పత్రాలు అనగా మొబైల్ కొన్న బిల్లులు దగ్గర ఉంచుకోవాలి .
ఇప్పుడు https://sancharsaathi.gov.in/ పోర్టల్ లో లాగిన్ అయ్యి మొబైల్ బ్లాక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అవసరమైన సమాచారం అందించి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన్నపుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది దీని ద్వారానే మీరు తరువాత స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Share your comments