సాధారణంగా మొక్కలు కొన్ని వందల వేల సంవత్సరాలు బతుకుతాయనే విషయం మనకు తెలిసిందే. అయితే అవి పెద్ద వృక్షాలుగా మారి వందల సంవత్సరాలు కొద్దీ బతుకుతాయి. కానీ కేవలం చిన్న మొక్కలు నెలల పాటు మాత్రమే బ్రతకడం మనం చూస్తుంటాము. కానీ ఈ చిన్న మొక్క మాత్రం ఏకంగా రెండు వేల సంవత్సరాలు బ్రతుకుతుంది అంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇంతకీ ఆ మొక్క ఏంటి? రెండు వేల సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...
చూడటానికి కేవలం రెండు ఆకులను మాత్రమే పోలి ఉండి రెండు వేల సంవత్సరాలు బ్రతికి ఉండే ఈ మొక్క పేరు వెల్విస్చియా ఈ విధమైనటువంటి మొక్కలు అత్యంత పురాతనమైన నమీబియా ఎడారులలో మాత్రమే కనిపిస్తాయి.ఆస్ట్రియా జీవ శాస్త్రవేత్త ఫ్రెడ్రిక్ వెల్విస్చ్ 1859లో ఈ మొక్కను గుర్తించడం వల్ల దీనికి అతని పేరుమీదుగానే వెల్విస్చియా అని నామకరణం చేశారు. అదేవిధంగా ఆఫ్రికాలో ఈ మొక్కను ట్విబ్లార్కన్నీడూడ్ అని పిలుస్తారు. ట్విబ్లార్కన్నీడూడ్ అంటే ఎప్పటికీ చనిపోలేని రెండు ఆకులు కలిగినటువంటి మొక్క అని అర్థం వస్తుంది.
ఈ మొక్క పుట్టినప్పుడు చూడటానికి కేవలం రెండు ఆకులు మాత్రమే ఉన్నప్పటికీ ఈ మొక్క పెరిగే కొద్దీ ఆకులు చీకుతూ కనిపిస్తాయి. ఈ విధంగా ఇటువంటి మొక్కల పై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల అనంతరం అధిక ఉష్ణోగ్రత నీటి ఎద్దడిని తట్టుకుంటూ అతి తక్కువ శక్తిని ఉపయోగించుకుని ఈ మొక్కలలో జరిగే జన్యు మార్పులను శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ విధంగా దీన్ని జన్యువులలో మార్పులు జరగడం వల్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితులను అయినా పెట్టుకొని ఈ మొక్క జీవించ గలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Share your comments