News

MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: హరిద్వార్, ఉత్తరాఖండ్

KJ Staff
KJ Staff

కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే MFOI ఉత్సవం ఈ రోజు ఉత్తరాఖండ్ హరియానాలో చోటుచేసుకుంది. ఎంతోమంది ప్రతిభావంతులైన రైతులు మరియు వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని, తమ అనుభవాలను పంచుకున్నారు.

రైతులు ఆరుగాలం కష్టించి పంటలు పండించకుంటే, ఈ భూమి మీద మనుగడ కష్టతరంగా మారేది. అయితే తన కష్టంతో దేశానికి ఆకలి తీర్చే రైతులకు మాత్రం గుర్తింపు ఉండదు. వ్యవసాయానికి విశేషమైన సేవ చేస్తున్న రైతులకు కూడా గుర్తింపు లభించాలన్న తపనతో కృషి జాగరణ, మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులను ప్రారంభించింది. ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించే ప్రతిచోటా సంరిద్ కిసాన్ ఉత్సవం నిర్వహించి ఈ అవార్డులు అందచెయ్యడం ప్రత్యేకం. ఈ రోజు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహీంద్రా ట్రాక్టర్స్ భాగస్వామ్యం వహించగా, ముతూట్ ఫింకార్ప్, సోమాని సీడ్స్, హరిద్వార్ వ్యవసాయ మరియు ఉద్యాన విభాగం, మరియు కేవీకే హరిద్వార్ పూర్తి సహాయసహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 600 మంది ఔత్త్సహికులైన రైతులు హాజరై ఈ కార్యక్రమానికి ఎనలేని ఉత్సహాని మరియు భారీ విజయాన్ని అందచేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైనవారందరికి రిజిస్ట్రేషన్ చెయ్యడంతో ఈ కార్యక్రమం మొదలయ్యింది. మొదటీగా ఈ క్రయక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరూ ఉదయం 10 గంటలకు దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృషి జాగరణ్ ముఖ్య సంపాదకులు మరియు చైర్మన్ ఎం.సి.డొమినిక్ ప్రసంగించి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులు మరియు రైతు మిత్రులందరికీ స్వాగతం తెలియచేసారు. అనంతరం మాట్లాడిన బూమ్రాట్ ఎఫ్. కంపెనీ నిర్వాహకులు మరియు చైర్మన్ మాట్లాడుతూ, తమ సంస్థ దాదాపు 500 మంది రైతులతో కలిసి పనిచేస్తుందని, ఐఐటీ రూర్కీ సహకారంతో, వాతావరణ విశేషాలని రైతులకు మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తునట్లు తెలిపారు. రైతుల మార్కెట్ అవసరాలను కూడా తీర్చి వారి అభ్యున్నతికి ఎల్లపుడు కృషి చేస్తామని ప్రస్తావించారు.

తరువాత హరిద్వార్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్, మహిపాల్ మాట్లాడుతూ, కృషి జాగరణ్ ప్రారంభించిన ఈ MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ కార్యక్రమం ఎంతో ప్రేరణదాయకమని కొనియాడారు. రైతుల అభ్యున్నతికి, మరియు వారి ఆర్థికాభివృద్ధి ఇటువంటి కార్యక్రమాలు ఊతమిస్తాయని అయన ప్రస్తావించారు. ఇటువంటి కార్యక్రమాలు దేశం నలుమూలల నిర్వహించడం ద్వారా వ్యవసాయానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. అతిధులు ప్రసింగించిన అనంతరం ముతూట్ ఫైనాన్స్ క్విజ్ పోటీ నిర్వహించి, విజేతలకు బహుమతులు కూడా అందచేశారు. చివరిగా మహీంద్రా ట్రాక్టర్స్ ప్రగతిశీల రైతులకు సర్టిఫికెట్స్ అందచేసి వారిని పురస్కరించడం జరిగింది. విజేతలు మరియు అతిధులు అందరి గ్రూప్ ఫోటో తో ఈ కార్యక్రమం ముగిసింది.

Share your comments

Subscribe Magazine

More on News

More