News

'వింగ్స్ టు కెరీర్' ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించిన కృషి జాగరణ్ !

Srikanth B
Srikanth B
కృషి జాగరణ్ 'వింగ్స్ టు కెరీర్' ప్లాట్‌ఫారమ్‌  సందర్భం గ మాట్లాడుతున్న కృషి జాగరణ్ ఎడిటర్ అండ్ చీఫ్ MC డొమినిక్
కృషి జాగరణ్ 'వింగ్స్ టు కెరీర్' ప్లాట్‌ఫారమ్‌ సందర్భం గ మాట్లాడుతున్న కృషి జాగరణ్ ఎడిటర్ అండ్ చీఫ్ MC డొమినిక్

 

న్యూ ఢిల్లీ : కృషి జాగరణ్ 'వింగ్స్ టు కెరీర్' ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది, వ్యవసాయ రంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి 'వింగ్స్ టు కెరీర్' అనే వ్యవసాయ సంబంధిత రంగాలలో యువత తమ భవిష్యత్తును నిర్దారించుకోవడానికి సహాయపడే ఒక వేదిక ను కృషి జాగరణ్ ప్రారంభించింది .

వ్యవసాయ సంబంధిత రంగాలలో యువత తమ భవిష్యత్తును నిర్దారించుకోవడానికి సహాయపడేందుకు కృషి జాగరణ్ ఈరోజు 'వింగ్స్ టు కెరీర్' - వ్యవసాయ ఆధారిత కెరీర్ ప్లాట్‌ఫారమ్ ను తన అధికారిక కార్యాలయం న్యూ ఢిల్లీలో ప్రారంభించింది .

ఈ కార్యక్రమానికి అతిథిగా డా. ఆర్.సి. అగర్వాల్ (DDG ఎడ్యుకేషన్ ICAR), డా. S. N. ఝా (DoG ఇంజనీర్ ICAR), డాక్టర్ రమేష్ మిట్టల్ (డైరెక్టర్ NIM), డాక్టర్ నూతన్ కౌశిక్ (అమిటీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫౌండేషన్), రాజు కపూర్ (డైరెక్టర్ కార్పొరేట్ వ్యవహారాలు), డాక్టర్ ఒంబిర్ S. త్యాగి (VP UPL లిమిటెడ్), మోరుప్ నామ్‌గిల్ (ఇఫ్కో హెడ్), సంగీత పాండే (జాయింట్ కోఆర్డినేటర్ AIOA), కృష్ణ సుందరి (ప్రొఫెసర్ బయోటెక్నాలజీ JP), ప్రొఫెసర్ శ్వేతా ప్రసాద్ (ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్ ఇంపీరియల్ స్కూల్ ఆఫ్ బిజినెస్) తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిధిడా. ఆర్.సి.అగర్వాల్ DDG ఎడ్యుకేషన్ ICAR మాట్లాడుతూ 'వింగ్స్ టు కెరీర్ ప్లాట్‌ఫారమ్'ని గొప్ప ఆవిష్కరణ అని , దీని ద్వారా వ్యవసాయ విద్య యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మరింత పెరుగుతోందని,మెడికల్, ఇంజినీరింగ్‌తో పాటు విద్యార్థులు ఇప్పుడు వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నారని, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ వింగ్స్ టు కెరీర్ ప్లాట్‌ఫారమ్ విద్యార్థులలో స్టార్టప్‌ల ఏర్పాటు ధోరణిని పెంపొందిస్తుందన్నారు .

ఇది కూడా చదవండి .

కేంద్రం గుడ్ న్యూస్: ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..13వేలకు పైగా సేవలకు ప్రభుత్వ పోర్టల్

కార్పోరేట్ వ్యవహారాల డైరెక్టర్ రాజు కపూర్
కార్పోరేట్ వ్యవహారాల డైరెక్టర్ రాజు కపూర్

కార్పోరేట్ వ్యవహారాల డైరెక్టర్ రాజు కపూర్ ఈ వింగ్స్ టు కెరీర్ ప్లాట్‌ఫారమ్‌ను మంచి చొరవగా అని అభివర్ణించారు. ఈ టెక్నాలజీ యుగంలో కాలానికి అనుగుణంగా మారాల్సి ఉందని, నేటి విషయాలు రేపటికి సరిపడవని ఆయన అన్నారు. ప్రపంచంలో కృత్రిమ మేధ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు . దీంతో ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. నేటి విద్యార్థులు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో పనిచేయాలన్నారు.

అదేవిధంగా విద్యార్థుల కోసం ప్రారంభించిన ఈ వేదిక కృషి జాగరణ్‌ను డాక్టర్ రమేష్ మిట్టల్ అభినందించారు. ప్రస్తుతం పరిశ్రమలో వ్యవసాయ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. అగ్రి సెక్టార్ స్టార్టప్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి ఆయన మాట్లాడుతూ దేశంలోని యువత వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లలోకి అడుగుపెడుతున్నారని చెప్పారు .

ఇది కూడా చదవండి .

కేంద్రం గుడ్ న్యూస్: ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..13వేలకు పైగా సేవలకు ప్రభుత్వ పోర్టల్

Related Topics

krishijagrannews

Share your comments

Subscribe Magazine