ఈ కార్యక్రమానికి విరాళాలు అందిచే కంపెనీలు లేదా మీ ఉత్పత్తులు ప్రదర్శించాలి అనుకునే దాతలు ఎక్కడ ఉన్న గూగుల్ ఫారం ని ఫిల్ చెయ్యడం ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు: Google Form Link:https://kjcdn.gumlet.io/media/95865/whatsapp-image-2024-02-19-at-145940.jpeg?w=700&dpr=1.0
ప్రముఖ అగ్రికల్చర్ మీడియా సంస్థ కృషి జాగరణ్ తమ MFOI, వివిఐఎఫ్ కిసాన్ భారత్ యాత్ర, శోభాయాణంగా వచ్చే నెల మార్చ్ 5 వ తారీఖున, ఉత్తరప్రదేశ్, ఝాన్సీ లో గల ఆర్ ఎల్ బి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి ప్రారంభించబోతున్నది. కృషి జాగరణ్ ఎల్లపుడు రైతుల అభ్యున్నతికి, వికాసానికి ఎంతగానో కృషి చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆర్ ఎల్ బి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతులమీదుగా ప్రారంభం చేస్తారు. మరొక్క ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ కార్యక్రంలో 300 మంది ప్రగతిశీల రైతులు పాలుపంచుకుంటారు. కృషి జాగరణ్ సగౌరవంగా వారిని ప్రతిష్టాత్మకమైన MFOI, అవార్డ్స్ తో వారిని సత్కరించనుంది.
MFOI, వివిఐఎఫ్ కిసాన్ భారత్ యాత్ర:
మా ఈ MFOI, వివిఐఎఫ్ కిసాన్ భారత్ యాత్ర ముఖ్య ఉదేశ్యం, భారత దేశం లో ఉండి సేద్యానికి విశేషమైన కృషి చేసి మంచి విజయాలు సాధించిన రైతులను గుర్తించి వారిని పురస్కరించడం. ఇప్పటికే ఉత్తర మరియు దక్షిణ భారత దేశం లో ప్రారంభం అయినా ఈ యాత్ర, ఇప్పుడు పడమటి రాష్ట్రాల వైపుగా సాగుతుంది.
డిసెంబర్ 2023 లో ప్రారంభం అయిన ఈ కార్యక్రమం, ఈ ఏడాది నవంబర్ వరకు కొనసాగనుంది. మొత్తం 25 రాష్ట్రాల్లో 4520 స్థానాల్లో పర్యటిస్తూ ఒక లక్ష కంటే ఎక్కువ మంది రైతులను అనుసంధానం చెయ్యాలి అనేది ఈ యాత్ర ముఖ్య లక్ష్యం. మహీంద్రా ట్రాక్టర్లు వారి సహకారం తో, సాగు కు నూతన విజ్ఞాన్ని జోడించి గొప్ప సేవ చేసిన కర్షకులకు, మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియన్ 2023 అవార్డ్స్ తో సత్కరించారు.
వ్యవసాయ పురోగతకి కృషి చేసి, అసాధారణ విజయాలు సాధించి, రెట్టింపు లాభాలు సాధించిన రైతులను లక్షాధికారి రైతులు(మిల్లియనీర్ ఫార్మర్స్ ) అని పిలుస్తారు. ఇటువంటి రైతులను, భారత దేశంలోని అగ్రిటెక్ కంపెనీలను ఒక్క త్రాటి పైకి చేర్చాలి అనేది ఈ కార్యక్రం ఉదేశం
Share your comments