News

కృషి జాగరణ్ సంరిద్ కిసాన్ ఉత్సవ్ 2024: ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పుర్

KJ Staff
KJ Staff

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సంరిది కిసాన్ ఉత్సవ్ ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పుర్ కృషి విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. రైతుల వ్యవసాయ అనుభవాలను పంచుకునే గొప్ప అవకాశం ఈ సంరిద్ కిసాన్ ఉత్సవ్ కల్పిస్తుంది.

భారత దేశంలోనే అత్యుత్తమ వ్యవసాయ పాత్రికేయ సంస్థగా పేరొందిన కృషి జాగరణ్ రైతుల కోసం ఎల్లపుడు వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించి వాటిని రైతుల ముందుకు తీసుకువస్తుంది. ఇలాంటి కార్యక్రమంలో ఒకటే ఈ సంరిద్ కిసాన్ ఉత్సవాలు, అయితే ఈ కార్యక్రమాన్ని ఒక ప్రాంతంలోనే లేదా ఒక రాష్ట్రంలోనో నిర్వహించడం కాకుండా ఏకంగా దేశం మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కృషి వ్యవస్థాపకులు మరియు ముఖ్య సంపాదకులు ఎం.సి. డొమినిక్ ఈ ఆలచన వెనుకున్న సృష్టికర్త. గత ఏడాది ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికే ఎన్నో అపూర్వమైన విజయాలను అందుకుంది.

ఈ ఏడాది కూడా ఎన్నో ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమం, గోరఖ్పూర్ లోని మహాయోగి కృషి విజ్ఞాన్ ప్రాంతంలో జరుగుతుంది. ' రైతుల ఆర్ధికాభివృధే సుసంపన్నమైన భారతానికి పునాది' అనే థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహీంద్రా ట్రాక్టర్లు భాగస్వాములు కాగా, ముతూట్ ఫైనాన్స్ మరియు సోమని సీడ్స్ సహకారాన్ని అందిస్తున్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఈ సంరిద్ కిసాన్ ఉత్సవ్ కు నాలెడ్జ్‌బేల్ పార్టర్న్ గా వ్యవహరిస్తోంది.

ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి గోరఖ్పూర్ వ్యవసాయ శాఖ మరియు మహాయోగి గోరఖ్నాథ్, కేవీకే గోరఖ్పూరు తమ సహాయసహకారాలు అందించారు. రైతులకు నూతన వ్యవసాయ విధానాల మీద పూర్తి అవగహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.

ఇంక ఈ కార్యక్రమంలో ఈ రోజు జరిగిన విశేషాల గురించి చూస్తే కేవీకే మరియు వ్యవసాయ శాఖ నుండి శాస్త్రజ్ఞులు విచ్చేసారు. డా. అజిత్ కుమార్ శ్రీవాత్సవ, సినియర్ సైంటిస్ట్, ఉద్యాన విభాగం, డా. సందీప్ ప్రకాష్ ఉపాధ్యాయ, సైంటిస్ట్ సాయిల్ సైన్స్, శివమ్ సింగ్, టెర్రిటరీ మేనేజర్ మహీంద్రా ట్రాక్టర్లు, సంజయ్ సేథ్, చీఫ్ మార్కెటింగ్ మేనేజర్, ముతూట్ ఫైనాన్స్, డా. రాజేష్ కుమార్, సీనియర్ సైంటిస్ట్ కేవీకే, ఏ.కే తివారి, డిహ్ఓ గోరఖ్పూర్ మరియు పెద్ద సంఖ్యలో రైతు మిత్రులు పాల్గొన్నారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1:15 నిమిషాల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ శాస్త్రజ్ఞులు రైతు సోదరులకు నూతన వ్యవసాయ విధానాలపై, ప్రాంతీయంగా సాగు చేస్తున్న పంటల మీద, వాటికి వచ్చే రోగాలు మరియు వాటి నివారణ పద్దతుల మీద సమగ్రంగా చర్చించారు. రైతులు సోదరులు వారికున్న సందేహాలను నిర్వృత్తి చేసుకున్నారు. అంతేకాకుండా గోరఖ్పూర్ ప్రాంతంలో ఆదర్శ రైతులైన బబితా పసావాన్ మరియు రాజు సింగ్ వారి విజయ గాధలను రైతులతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి భాగస్వాములైన మహీంద్రా ట్రాక్టర్లు తరపు నుండి టెర్రిటరీ మేనేజర్ శివమ్ సింగ్ విచ్చేసి, మహీంద్రా వ్యవసాయం కోసం రూపొందించిన కొత్త ట్రక్టర్ల గురించి వివరించారు అంతేకాకుండా ఈ కార్యక్రమం ఆవరణలో ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి మహీంద్రా ట్రాక్టర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం చివరిలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం జరిగింది. ఈ విధంగా పెద్ద ఎత్తున రైతులు మరియు వ్యవసాయ శాస్త్రజ్ఞులు పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Share your comments

Subscribe Magazine

More on News

More