నీటి వినియోగం, సమర్థత మరియు సంరక్షణను నిర్వహించడం , చేయడం కొరకు వ్యవసాయ ధారణీయత మరియు టెక్నిక్ లపై విస్త్రృతంగా పనిచేయడం, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరచడం మరియు ప్రపంచవ్యాప్తంగా రైతుల జీవితాలు మరియు జీవనోపాధిని సుసంపన్నం చేసే పరిష్కారాలు మరియు నాలెడ్జ్ ని అందించడం వంటి అంశాలపై కృషి జాగరణ్ వెబినర్లను నిర్వహించనుంది .
భూగర్భజలాలు భారతదేశానికి జీవనాడి. ఇది గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరాలో 85 శాతాన్ని అందిస్తుంది. భూగర్భ జలాలు కూడా పట్టణ తాగునీటిలో65 శాతం అందిస్తాయి. అదేవిధంగా, భూగర్భ జలాలు 65 శాతం వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తాయి మరియు పారిశ్రామిక అవసరాల లో 55 శాతం నీటిని అందిస్తాయి.
పైన పేర్కొన్న అంశాల పై గత సంవత్సరంలో భారతదేశం అంతటా వ్యవసాయ కమ్యూనిటీల ద్వారా అనేక గుర్తించదగిన నీటి సంరక్షణ చర్యలు జరిగాయి. రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వాలు అమలు చేస్తున్న అత్యంత ముఖ్యమైన నీటి సంరక్షణ చర్యలను ఎక్కడ వివరించడం జరిగింది.
గత వారం రోమ్ నగరం లో జరిగిన సదస్సులో, ఐజిఆర్ఎసి ప్రతిపాదించిన విధంగా "భూగర్భజలం: పరిరక్షించడం " అనే అంశం ప్రపంచ నీటి దినోత్సవం 2022 కోసం ప్రధానాంశంగా ఉండాలని యుఎన్-వాటర్ నిర్ణయించింది.
ఇటలీలోని రోమ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ) ప్రధాన కార్యాలయంలో 30వ ఐక్యరాజ్యసమితి-నీటి శిఖరాగ్ర సమావేశం జరిగింది..ఏ సమావేశం లో .నీటి వినియోగం, సమర్థత మరియు సంరక్షణను , వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరచడం మరియు ప్రపంచవ్యాప్తంగా రైతుల జీవితాలు మరియు జీవనోపాధిని సుసంపన్నం చేసే పరిష్కారా మార్గాలు అన్వేషించడం కోసం ,
వ్యవసాయంలో నీటి యొక్క సుస్థిర వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం కొరకు పరిశ్రమకు చెందిన ప్రముఖ వక్తలతో వెబినార్ నిర్వహించడం అనేది ఒక అద్భుతమైన ఆలోచన ,దీనిని దృష్టిలో ఉంచుకొని, కృషి జాగరణ్, ఎఫ్ఎంసి ఇండియా సహకారంతో, 'ప్రపంచ నీటి దినోత్సవం 2022' సందర్భంగా "వ్యవసాయంలో నీటి యొక్క సుస్థిర వినియోగం" అనే ఇతివృత్తంతో ఒక వెబినార్ను నిర్వహిస్తోంది. ఈ సెషన్ మార్చి 22, 2022న మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది.
చర్చ యొక్క ప్రధాన అంశాలు:
గ్రామ స్థాయిలో సీజనల్ నీటి లభ్యత- ఉపరితలం మరియు భూగర్భజలాలను నిల్వలను పెంచడం.
నీటి లభ్యతను బట్టి పంట రకాలను ఎంచుకోవడం.
డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ లు మరియు మల్చింగ్ వంటి నీటిని ఆదా చేసే టెక్నాలజీలను పరిచయం చేయడం మరియు మరింత నీటి సంరక్షణను ప్రోత్సహించడం
Share your comments