News

ఫీల్డ్ డే నిర్వహించిన విజ్ఞాన్ కేంద్ర: అనుభవాలను తెలియపరిచిన శాస్త్రజ్ఞులు:

KJ Staff
KJ Staff

ఢిల్లీ లోని ఉజ్వా గ్రామం లో, కృషి విజ్ఞాన్ కేంద్రం ఆవాల పంట విశిష్టత తెలియచేసేందుకు ఫీల్డ్ డే ని ప్రారంభించింది. ఆవల సాగులో కొన్ని ముఖ్యమైన రకాలను మరియు కొన్ని మెళుకువలను , ఈ కార్యక్రమనికి హాజరు అయ్యిన వ్యవసాయ శాస్త్రవ్రేత్తలు తెలియచేసారు.

ఫిబ్రవరి 21, 2024 న న్యూ ఢిల్లీ లోని ఉజ్వ కు చెందిన కృషి విజ్ఞాన్ కేంద్రం, ఆవాల పంట సాగు చేస్తున్న రైతులకు కొన్ని కీలక విషయాలపై అవగాహన కల్పించేందుకు , జున్నతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది . ఢిల్లీ రైతులకు ఆవాల పంట సుపరిచితమైనది, కానీ కొన్ని కారణాల వళ్ళ ఈ పంట దిగుబడి ఈ మధ్య కాలంలో ఎంతో తగ్గింది అని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ ఏరియా కేవీకే హెడ్, డా. డీ. కే. రానా తెలిపారు. ఈ పరిస్థితిని ఎదురుకొనేందుకు, మరియు ఆహార భద్రతను కాపాడేందుకు, అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ అఫ్ డిల్లీ చే , అభివృద్ధి చెయ్యబడిన ఆవాల రకాలను, ప్రదర్శించింది.

దానస, ఉజ్వ, జఫరాబాద్ , కాంజిపూర్, సమస్పూర్, ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన, R.H.-725 రకం విత్తనాలు రైతులకు అందచేశారు. వాటితో పాటుగా జీవ శిలింద్రనాశనులను, వాటి వాడకం వాళ్ళ వినియోగాలను రైతులకు తెలియపరిచారు. చౌదరి చరణ్ సింగ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వారు తయారు చేసిన ఈ R.H.-725 రకం విత్తనం ఎకరాకు 25 టన్నుల దిగుబడిని, 40-42% నూనెని ఇస్తుంది అని సీనియర్ ప్లాంట్ సైన్స్ స్పెషలిస్ట్ డా. సామర్ పాల్ సింగ్ అన్నారు.

ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాం విత్తనాలను ప్రదర్శిస్తూ, ఈ R.H.-725 రకాం మొక్కలు, మిగిలిన రకాల కంటే అధిక బరువు కలిగిన విత్తనాలను, ఇస్తుంది అని చరణ్ సింగ్ రైతులకు తెలిపారు. అంతే కాకుండా ఆ ప్రాంతం లోని రైతులు అందరూ వచ్చే ఏడాది ఈ R.H.-725 రకామ్ విత్తనాలు వాడాలి అని సూచించారు.

Share your comments

Subscribe Magazine

More on News

More