గత సంవత్సరం సెప్టెంబర్ 17 న ప్రధాని తన పుట్టిన రోజు సందర్భముగా 8 చిరుతలను 5 ఆడ 3 మగ చిరుతలు మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలిన విషయం తెలిసినదే అయితే ప్రస్తుతం చిరుతలు ఆరోగ్య కరమైన పరిస్థితులతో ఉండడంతో దేశంలో త్వరలోనే మరో 12 చిరుతలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది .
జనవరి చివరినాటికి దక్షిణాఫ్రికా నుంచి ఈ చిరుతలు కునో నేషనల్ పార్కు కు చేరుకుంటాయని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇందుకోసం పార్కులో ప్రత్యేక సదుపాయాలతో కుడైన ఎన్‌క్లోజర్ సైతం సిద్ధం చేస్తున్నారు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికా అధికారులతో చర్చలు తుదిదశకు వచ్చాయని, అన్నీ అనుకున్నట్లు కుదిరితే జనవరి నెలలోనే 12 చిరుతలు కునో పార్కుకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌కు రావాల్సిన చిరుతలన్నీ గత ఆర్నెళ్లుగా దక్షిణాఫ్రికాలో క్వారంటైన్‌లో ఉన్నాయని సమాచారం.
రూ . 500,1000 నోట్ల రద్దు పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ...
1952 సంవత్సరం నాటికి భారతదేశంలో చిరుతలు అంతరించిపోయినట్లు గణాంకాలు ఉన్నాయి. అయితే అప్పటి ప్రధాని ఇందిరా గండి సైతం చిరుత పులులను భారత దేశానికి తెప్పించడానికి ప్రయత్నాలు కూడా చేసిందని , 70 సంవత్సరాల తరువాత గతేడాది భారత్‌లోకి ఈ పులులను ఆఫ్రికా ఖండంలోని నమీబియా నుంచి తీసుకొచ్చారు. తాజాగా మరో 12 చిరుత పులులను ఇండియాకు తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి చివరినాటికి దక్షిణాఫ్రికా నుంచి ఈ చిరుతలు కునో నేషనల్ పార్కు కు చేరుకుంటాయని సమాచారం. ఇందుకోసం పార్కులో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లనుసైతం సిద్ధం చేస్తున్నారు.
Share your comments