ఉత్తర్ ప్రదేశ్, హాపూర్ లో గల, బాబుగర్హ్ కృషి విజ్ఞాన కేంద్రంలో , రైతుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే MFOI కిసాన్ సంరిద్ ఉత్సవ్ కు రంగం సిద్ధమైంది.
ఇటీవల మహారాష్ట్ర, సోలాపూర్లోని, మోహోల్- కేవీకే వేదికగా నిర్వహించబడిన, 'ఎంఎఫ్ఒఐ సంరిద్ కిసాన్ ఉత్సవ్' ఘన విజయం సాధించింది అని అందరికి తెలిసిన విషయమే. ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ వారు, సోలాపూర్ కార్యాక్రమాన్ని సమర్పించారు. ఇప్పుడు ఇదే తరహాలో ఉత్తర ప్రదేశ్ హాపూర్, బాబుగర్హ్- కేవీకే వేదికగా, 12 మార్చ్, 2024, ఉదయం 10:00 గం.లకు ఘనంగా ప్రారంభం కాబోతుంది. రైతులకు మరియు వ్యవసాయ అనుబంధ సంస్థలకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ కార్యక్రమంలో వ్యవసాయానికి సంబంధించిన అనేక కొత్త విషయాలను తెలుసుకోవచ్చు, మరియు మీ అనుభవాలను ఇతరులతో పంచుకోవచ్చు.
వ్యవసాయ వైజ్ఞానికులు వస్తున్నారు.
రైతులకు కొత్త వ్యవసాయ పద్దతుల మీద అవగాహన కల్పించి వారి వ్యవసాయ ఉత్పాదకత పెరగడంలో తోడ్పడటమే MFOI కిసాన్ సంరిద్ ఉత్సవ్ యొక్క ముఖ్య ఉదేశ్యం. ఈ కార్యక్రమాలకి, వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ సంస్థల వైజ్ఞానికులు విచ్చేస్తారు. వ్యవసాయానికి సంబంధించిన అనేక మెళుకువలను, పంట రోగాల నివారణ చర్యలను నిపుణులు రైతులకు వివరిస్తారు. అంతే కాకుండా మరొక్క ఆశ్చర్యం కలిగించే విష్యం ఏమిటంటే, ఈ కార్యక్రమంలో భాగంగా, లక్షాధికారి రైతులను, మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులతో సత్కరిస్తారు. రైతులకు ఇటువంటి అవార్డులు ఇవ్వడం దేశంలో ఇదే ప్రప్రధమం. ఈ ఘనత భారత దేశంలోనే అత్యుత్తమ అగ్రికల్చర్ మీడియా హౌస్ గ పేరొందిన కృషి జాగరణ్ కె సొంతం.
మహీంద్రా ట్రాక్టర్స్ ప్రదర్శన:
వ్యవసాయానికి అనువైన, ట్రాక్టర్లను రూపొందించడంలో పేరున్న మహీంద్రా ట్రాక్టర్స్ MFOI కిసాన్ సంరిద్ ఉత్సవ్ కు తమ సహకారాన్ని అందిస్తున్నారు. కిసాన్ సంరిద్ ఉత్సవాల్లో భాగంగా, మహీంద్రా ట్రాక్టర్స్, వారి ట్రాక్టర్లను ప్రదర్శనలో ఉంచుతారు. మీ అన్ని వ్యవసాయ పనులకు అనుగుణంగా ట్రాక్టర్లను రూపొందించడం జరిగింది. ఈ ట్రాక్టర్స్ మీ వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో మీకు సహాయ పడతాయి.ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తారని ఆసిస్తున్నాము.
Share your comments