భారత దేశంలోని రైతులందరికీ, కృషి విజ్ఞాన్ కేంద్రం (KVK) పేరు సుపరిచితమే. దాదాపు భారత దేశములోని అన్ని జిల్లాల్లో కేవీకేలు వ్యవసాయరంగానికి ఎన్నో సేవలను అందిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి విశేష సేవలు అందిస్తున్న కృషి విజ్ఞాన్ కేంద్రం ఈ రోజు కేవీకే స్థాపన దినోత్సవాని జరుపుకుంటుంది.
కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతగానికి అందిస్తున్న సేవలను కొనియాడటానికి ప్రతి సంవత్సరం మార్చ్ 21 న కేవీకే ఫౌండేషన్ డే గా జరుపుకుంటారు. భారత దేశంలోని మొట్టమొదటి కృషి విజ్ఞాన్ కేంద్రం 1974 మార్చ్ 21న , పుదుచ్చేరిలో స్థాపించబడింది. కలక్రమేనా కృషి విజ్ఞాన్ కేంద్రాల విశిష్టతను గుర్తించి, దేశంలోని అన్ని జిల్లాలకు ఒక్కో కేవీకే చొప్పున నిర్మించుకుంటూ వచ్చింది ప్రభుత్వం. 2023 నాటికీ దేశమంతటా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు వెలిసాయి. పుదుచ్చేరిలో ఈ రోజు ఫౌండేషన్ డే కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
Read More..
Breaking News: తెలంగాణ కొత్త గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం.
కృషి విజ్ఞాన్ కేంద్రాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ICAR) జిల్లా స్థాయి అనుబంధ సంస్థలుగా పనిచేస్తాయి. భారత పరిశోధన కేంద్రాలు వ్యవసాయం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంకేతికతను రైతుల వద్దకు చేర్చడంలో కృషి విజ్ఞాన్ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొత్త వ్యవసాయ పద్దతులను, కొత్త రకం విత్తనాలను, వ్యవసాయ యంత్రాలను, కేవీకే లు ముందుగా వారి పరిశోధన స్థలాల్లో, సాంకేతికత సామర్ఢ్యన్ని పరీక్షించి, ఆ తరువాత రైతుల వద్దకు చేరుస్తారు. అలాగే వ్యవసాయంలో వచ్చే సమస్యలను తీర్చడానికి, వ్యవసాయ రంగంలోని ప్రతీ శాఖకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. అధికారులు రైతులకు నూతన వ్యవసాయ విధానాలను అందించి, వ్యవసాయ అభివృధికి మార్గదర్శిగా నిలుస్తారు.
కేవీకేల నిర్వహణకు, ICAR మరియు రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయాలు మూలస్థంబలుగా నిలుస్తాయి. కృషి విజ్ఞాన్ కేంద్రం, నిర్వహణకు అయ్యే ఖర్చును మొత్తం భారత ప్రభుత్వం భరిస్తుంది.
Share your comments